Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

‘బ‌ద్వేలులో దొంగలు, పోలీసులు ఒక్క‌ట‌య్యారు’ అంటూ సి.ఎం ర‌మేశ్ ఆగ్ర‌హం.. 

‘బ‌ద్వేలులో దొంగలు, పోలీసులు ఒక్క‌ట‌య్యారు’ అంటూ సి.ఎం ర‌మేశ్ ఆగ్ర‌హం.. 

  • కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్
  • బీజేపీ ఏజెంట్ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌న్న ర‌మేశ్
  • పోరుమామిళ్ల‌లో బ‌యటి వ్య‌క్తులు తిరుగుతున్నార‌ని ఆరోప‌ణ‌
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతోంది. అయితే, పోలింగ్ జ‌రుగుతోన్న తీరు ప‌ట్ల బీజేపీ నేత‌లు మండిపడుతున్నారు. బ‌ద్వేలు ప‌రిధిలో బీజేపీ ఏజెంట్ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు. ఈ ఉప ఎన్నిక‌లో దొంగలు, పోలీసులు ఒక్క‌ట‌య్యారంటూ ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద కేంద్ర బ‌ల‌గాలు లేక‌పోవ‌డంతో స్థానిక పోలీసులే ఉంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. పోరుమామిళ్ల‌లో బ‌యటి వ్య‌క్తులు తిరుగుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.
 
కాగా, బ‌ద్వేలులో ప‌రిస్థితుల గురించి తెలుపుతూ బీజేపీ ప‌లు వీడియోలు విడుద‌ల చేసింది. తిరుపతి ఉప ఎన్నిక‌ అయినా, బద్వేలు ఉప ఎన్నిక‌ అయినా వీరు రక్షక భటులు కాదు, ప్రేక్షక భటులు అంటూ విమ‌ర్శ‌లు గుప్పించింది. ఎంచక్కా రాజ్యాంగం ప్రకారం జీతాలు తీసుకుంటూ, అదే రాజ్యాంగానికి వైసీపీ నాయకులు తూట్లు పొడుస్తుంటే సినిమా చూస్తున్నారని ఆరోపించింది. ఈ దిగజారుడు పనులకు సిగ్గుపడాలని విమర్శించింది. చివరికి ముఖ్యమంత్రి జ‌గ‌న్ సొంత జిల్లాలో కూడా దొంగ ఓట్లకు వైసీపీ నాయ‌కులు తెర‌తీశారని పేర్కొంది.

Related posts

త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల్లో 70 శాతం పైగా పోలింగ్…

Drukpadam

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉష చిలుకూరి వంశ వృక్షం ఇదీ!

Ram Narayana

సంగం డైరీ వ్యవహారంలోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బే!

Drukpadam

Leave a Comment