పునీత్ మరణానికి దారి తీసిన కార్డియాక్ అసిస్టోల్..అంటే ఏమిటీ?
-దీంతో ప్రాణాలతో బయటపడ్డవారు 2 శాతమే
-కార్డియాక్ అసిస్టోల్ అంత శక్తిమంతమైందా?
-దీన్ని ఎలా గుర్తించవచ్చు?
-కుటుంబ సభ్యుల అనుమతి లేనిదే..ట్రీట్మెంట్ చెయ్యరా ?
-ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది
కన్నడ నటుడు పునీత్ మరణానికి దారి తీసిన కార్డియాక్ అసిస్టోల్ గురించి దేశవ్యాప్తిగా చర్చ జరుగుతుంది…అంటే ఏమిటీ?
కన్నడ చలన చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచి వేసిన సంఘటన- టాప్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత. గుండెపోటుకు గురి కావడంతో ఆయన కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో అస్వస్థతకు లోనయ్యారు. వెంటవెంటనే రెండుసార్లు ఆయనకు గుండెపోటు వచ్చింది. విక్రమ్ ఆసుపత్రి ఐసీయూలో అత్యవసర చికిత్స అందించినప్పటికీ.. ఆయన ప్రాణాలను డాక్టర్లు కాపాడలేకపోయారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కోట్లాదిమంది అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
పునీత్ రాజ్‌కుమార్ మరణానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ విక్రమ్ ఆసుపత్రి డాక్టర్లు ఓ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన కార్డియాక్ అసిస్టోల్ (Cardiac Asystole)కు గురయ్యారని వెల్లడించారు. ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని చెప్పారు. తాము అత్యాధునిక వైద్యాన్ని అందించినప్పటికీ.. ఆయన శరీరం స్పందించలేదని పేర్కొన్నారు. ఆయనను కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశామని చెప్పారు.
పునీత్ రాజ్‌కుమార్ మరణంతో.. కార్డియాక్ అసిస్టోల్ అనే పదం పాపులర్ అయింది. అసలు ఈ పదం ఏమిటీ? హఠాత్తుగా ప్రాణం తీసేలా, ఆరోగ్య పరిస్థితులను విషమింపజేయడానికి దారి తీసే కార్డియాక్ అసిస్టోల్ అనే పదానికి అర్థం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 46 సంవత్సరాల వయస్సులో.. శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉన్న ఓ టాప్ హీరో ప్రాణాలను అంత త్వరగా తీయడానికి ఇది ఎలా కారణమైందనేది చర్చనీయాంశమైంది.
కార్డియాక్ అసిస్టోల్ అనేది- గుండె పనితీరును రెప్రజెంట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడాన్ని వైద్యపరంగా అసిస్టోల్ అంటారు. గుండె పనితీరు స్తంభించిందనడానికి ఈ పదాన్ని వాడుతారు. గుండెపోటు తీవ్రంగా, ప్రాణాంతకంగా ఉన్నప్పుడే కార్డియాక్ అసిస్టోల్ అనే వాదాన్ని ప్రయోగిస్తారని తెలుస్తోంది. ఆ మరుక్షణమే ఆ వ్యక్తికి చికిత్స అందించకపోతే నిమిషాల్లో ప్రాణం పోతుందని నిపుణులు చెబుతున్నారు.
కార్డియాక్ అసిస్టోల్‌కు గురై ప్రాణాలతో బయటపడిన వారు కేవలం 10 శాతం లోపే. ఇందులో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మరింత తక్కువ. ఆసుపత్రి డిశ్చార్జ్ రేటు రెండు శాతమేనని నిపుణులు చెబుతున్నారు. కార్డియాక్ అసిస్టోల్‌ను ఈసీజీ ద్వారా గుర్తించవచ్చు. ఫ్లాట్ లైన్‌ను సూచిస్తుంది ఇది. పల్స్ లేకపోతే దాన్ని అసిస్టోల్‌గా భావిస్తారు. అసిస్టోల్ వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ (వీ-ఫిబ్)గా గుర్తిస్తారు. వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ అనేది గుండె రిథమ్‌ను సూచిస్తుంది. గుండె కవాటాలు సమన్వయాన్ని కోల్పోతాయి. బ్లడ్ పంపింగ్ అనేది సవ్యంగా సాగదు. చాలా వేగంగా ఫైబ్రిలేట్ అవుతుంది.
సాధారణంగా కార్డియాక్ అసిస్టోల్‌కు గురైన వారికి చికిత్స అందించడానికి ఆసుప్రతులు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో మరణాల రేటు అధికంగా ఉండటమే దీనికి కారణం. ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఫిజీషియన్స్.. దీనికోసం కొన్ని ప్రొటోకాల్స్ సైతం రూపొందించాయి.
అసిస్టోల్‌కు గురైన వ్యక్తికి అందించే చికిత్సను రీసస్కిటేషన్ అంటారు. దీన్ని ప్రారంభించే ముందు ఆ వ్యక్తి ప్రతిస్పందిస్తున్నారా? లేదా? అనేది టెస్ట్ చేస్తారు. పల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే కొంతమందిలో పల్స్ అంత త్వరగా అందదు. దాన్ని గుర్తించడానికి సమయం వృధాగా భావిస్తారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన శరీర స్పందనను గుర్తిస్తారు. ఎపినేఫ్రైన్ ఇంజెక్షన్‌ను నరాల ద్వారా ప్రతి మూడు నుంచి అయిదు నిమిషాల వ్యవధిలో ఒక మిల్లీ గ్రామ్ మేర వేయాల్సి ఉంటుంది. అప్పటికీ స్పందించకపోతే వాసోప్రెస్సిన్ ట్రీట్‌మెంట్ ఇస్తారు.