Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉష్… హుజురాబాద్ ఎన్నికపై బహిరంగ ప్రకటనలు వద్దు …రేణుకా చౌదరి!

ఉష్… హుజురాబాద్ ఎన్నికపై బహిరంగ ప్రకటనలు వద్దు …రేణుకా చౌదరి!
-కాంగ్రెస్ ఈటలకు మద్దతు … లోపల మాట్లాడుకుందాం
-హుజూరాబాద్ లో బీజేపీ ఎక్కడుంది? అది ముమ్మాటికీ ఈటల గెలుపే
-హుజూరాబాద్ లో గెలిచింది బీజేపీ కాదు
-ఈటల గెలుపు కోసం స్థానిక నేతలు కూడా పని చేశారు
-ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటున్నాం

హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఈ విజయాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాయి. మరోవైపు ఈటలకు కాంగ్రెస్ మద్దతు పలికిందంటూ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక పుట్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ… రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవే అయినా… ఆయన బయట మాట్లాడకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఉష్… హుజురాబాద్ ఎన్నికపై బహిరంగ ప్రకటనలు వద్దు … పార్టీకి సంబంధించిన అంశాలను పార్టీ వేదికపైనే మాట్లాడాలని రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు .కాంగ్రెస్ ఈటలకు మద్దతు … లోపల మాట్లాడుకుందాం అన్నారు .

హుజూరాబాద్ లో గెలిచింది బీజేపీ కాదని… అది ముమ్మాటికీ ఈటల గెలుపేనని రేణుకా చౌదరి అన్నారు. ఈటల గెలుపు కోసం స్థానిక నేతలు కూడా పని చేశారని చెప్పారు. హుజూరాబాద్ లో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటున్నామని చెప్పారు.

ఒక ఉప ఎన్నికతో ఏం కొంపలు మునుగుతాయని ఓ వర్గం అంటోంది: జగ్గారెడ్డి విమర్శ
పార్టీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్న జగ్గారెడ్డి

 

హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. మరోవైపు ఎన్నిక ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈటలకు కాంగ్రెస్ పార్టీ మద్దతును ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఈ పరిస్థితుల్లో ఈరోజు టీపీసీసీ సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. అయితే ఈ సమావేశం మధ్యలోనే సీనియర్ నేత జానారెడ్డి వెళ్లిపోయారు. మరోపైపు జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తాను ఏదైనా పార్టీ బాగు కోసమే మాట్లాడతానని చెప్పారు.

ఓ ఉపఎన్నికతోనే ఏం కొంపలు మునుగుతాయని పార్టీలోని ఒక వర్గం అంటోందని విమర్శించారు. పార్టీ లోటుపాట్లపై మాట్లాడి తాను నిష్టూరం పడాలనుకోవడం లేదని చెప్పారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తన బలహీనత అని అన్నారు. స్టార్ నాయకులు వెళ్లి ప్రచారం చేస్తేనే హుజూరాబాద్ లో ఓట్లు పడలేదని… తాను వెళితే ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. పార్టీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Related posts

వైయస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయం….ఢిల్లీలో బిజీ ,బిజీ …

Ram Narayana

మోదీ, అమిత్ షా అహంకారానికి మునుగోడు ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు: కేటీఆర్

Drukpadam

ఓటీ ఎస్ పై చంద్రబాబు ఆగ్రహం …సజ్జల వివరణ…

Drukpadam

Leave a Comment