బీజేపీ పాలిట రాష్ట్రాలు వ్యాటు తగ్గించాయి మరి తెలంగాణ సంగతేమిటి ? : బండి సంజయ్
-తెలంగాణలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా? లేదా?
-కేంద్రం పెట్రోలుపై రూ.5, లీటరు డీజిలుపై రూ.10 తగ్గించింది
-బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి
-మరి తెలంగాణలో టీఆర్ఎస్ సుంకాన్ని తగ్గిస్తుందా?
పెట్రోల్ ,డీజిల్ రేట్ల పెరుగుదలపై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయనే విమర్శల నేపథ్యం లో కేంద్ర ఒక మెట్టు దిగి వచ్చి పెట్రోల్ పై రూ 5 ,డీజిల్ పై రూ 10 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది సామాన్యులకు కొంత ఊరట నిచ్చే అంశమే . పెట్రోలియం ధరలు వ్యాట్ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ ఉంది. దాన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెట్టుకొంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం దీనిప్రభావం స్పష్టంగా కనిపించిందని అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల దేశంలో ఉప ఎన్నికలు జరిగిన 29 శాసనసభ , 3 పార్లమెంట్ స్థానాల్లో కనిపించింది. దీంతో కేంద్రం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పెట్రోలియం , రేట్లను తగ్గించింది. దీనిపై స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రం పన్నులు తగ్గించింది. బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి. మరి తెలంగాణలోని టీఆర్ యస్ ప్రభుత్వం డీజిల్ ,పెట్రోలియం పై ఉన్న సుంకాలను తగ్గిస్తుందా ? అని ప్రశ్నించారు….
కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. రవాణాపై ఆధారపడి ఉన్న అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే, దీపావళి పండుగ సందర్భంగా పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు నిన్న కేంద్ర సర్కారు శుభవార్త చెప్పడంతో సామాన్యుడికి కాస్త ఊరట లభించింది.
లీటరు పెట్రోలుపై రూ.5, లీటరు డీజిలుపై రూ.10 తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాలను తగ్గించాలన్న డిమాండ్ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వమూ సుంకాన్ని తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
‘పెట్రోలుపై రూ.5, లీటరు డీజిలుపై రూ.10 తగ్గిస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. తెలంగాణలోనూ అధికార టీఆర్ఎస్ సుంకాన్ని తగ్గిస్తుందా? లేదా?’ అని ఆయన ప్రశ్నించారు. కాగా, హుజూరాబాద్ ఎన్నిక వేళ సిలిండర్లకు దండం పెట్టి వెళ్లి ఓటు వేయాలని టీఆర్ఎస్ తమ కార్యకర్తలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎన్నిక వేళ పెట్రోల్ ధరల పెరుగుదల అంశాన్ని పదే పదే ప్రస్తావించింది.