Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం లో పాత బస్ స్టాండ్ పూర్తిగా వెత్తివేయడం పై కొనసాగుతున్న ఆందోళనలు

ఖమ్మం లో పాత బస్ స్టాండ్ పూర్తిగా వెత్తివేయడం పై కొనసాగుతున్న ఆందోళనలు
-టీఆర్ యస్ మినహా అన్ని పార్టీలు ఆందోళన బాటలో
-అన్ని హంగులతో కొత్త బస్ స్టాండ్
ఖమ్మం లో మయూరి సెంటర్ కు సమీపంలో 60 సంవత్సరాలుగా ఉన్న పాత బస్సు స్టాండ్ స్థానంలో ఎన్నెస్పీ లో గల విశాలమైన స్థలంలో అన్ని అంగుళతో కొత్త బస్సు స్టాండ్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తీ అయింది. కొత్తగా అధునాతనమైన సౌకర్యాలతో కొత్త బస్సు స్టాండ్ నిర్మించటం పై హర్హతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. బస్ లను మార్చ్ 1 నుంచి కొత్త బస్ స్టాండ్ నుంచే తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా విడుదలైంది. దీంతో పాత బస్ స్టాండ్ పై ను పూర్తిగా తరలించడంపై ఒక్క సారిగా ఉలిక్కి పడ్డ ప్రతిపక్షాలు ఆందోళనలు బాట పట్టాయి. . పాత బస్ స్టాండ్ ను లోకల్ బస్సు లు నడిపేందుకు ఉపయోగించాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఖమ్మం నగరానికి పాత బస్ స్టాండ్ ప్రాంతం గుండెకాయలాంటిది. వ్యాపార ప్రాంతాలుగా ప్రసిద్ధిచెందిన కామన్ బజార్ , కస్బా బజార్ , గాంధీ చౌక్ ,పొట్టిశ్రీరాములు రోడ్, లాంటివి అతిదగ్గర ఉండటంతో ,ఇక్కడకు చుట్టూ పక్కల గ్రామాల నుంచే కాకుండా కోదాడ , సూర్యాపేట , మహబూబాబాద్ , డోర్నకల్ ,ఇల్లందు , వైరా , తల్లాడ , నేలకొండపల్లి , కూసుమంచి , మధిర, బోనకల్లు , లాంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వివిధ రకాల కొనుగోళ్లు చేస్తుంటారు. వారికీ ఇప్పుడున్న బస్ స్టాండ్ అనువుగా ఉంది. అంతే కాకుండా గత ఆరు దశాబ్దలుగా దీనిపై ఆధారపడి జీవిస్తున్న అనేకమంది జీవన భృతి కోల్పోనున్నారు. వారికీ ప్రత్యాన్మయాలు చూపించాల్సిన భాద్యత అధికారులపై ,ప్రజాప్రతినిధులపై ఉందని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణానికి నడిబొడ్డున ఉండటంతో పాటురైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉండటంతో అన్నిరకాల ఇది అందుబాటులో ఉంది. అందువలన అక్కడ నుంచి లోకల్ బస్సు లను నడిపాలని ఖమ్మం లోని వివిధ రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం కు చెందినవాడు అయినందున ఆయనపై వత్తిడి తేవటం ద్వారా ఖమ్మం పాత బస్ స్టాండ్ కొనసాగించేలా చర్యలు తీసుకునే ఆవకాశం ఉంటున్నదని వివిధ రాజకీయ పార్టీలు అభిప్రాయ పడుతున్నాయి. దీనిపై అఖిల పక్షసమావేశాలు ,రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఒక్క టీఆర్ యస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ఖమ్మం పాత బస్సు స్టాండ్ ను లోకల్ బస్సు స్టాండ్జ్ గా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ మంత్రికి వారి డిమాండ్ సహేతుకంగా అనిపించటం లేదు. అన్ని అంగుళతో కొత్త బస్ స్టాండ్ నిర్మిస్తే ప్రతిపక్షాలకు పనిలేక ఆందోళనలు చేస్తున్నారనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఇప్పటి వరకు అలవాటు పడలేదు కాబట్టి కొంత ఇబ్బంది అనిపించినా కొత్త బస్ స్టాండ్ ప్రాంతం కూడా బాగా అబివృద్ది చెందుతుందని అనేక మందికి జీవనోపాధి కలిపించే అవకాశం ఉందని ఆయన భిప్రాయం. కొత్త బస్ స్టాండ్ మోడ్రన్ గా అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. అయితే ఇప్పుడున్న బైపాస్ రోడ్ కొత్త బస్ స్టాండ్ వచ్చిన తరువాత విఫరీతమైన రద్దీగా ఉంది. ఇక కొత్త బస్ స్టాండ్ నుంచి బస్ నడవటం ప్రారంభమైన తరువాత రద్దీ మరింత పెరుగుతుంది. ఇప్పటికే బైపాస్ లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల ఖమ్మం కు రింగ్ రోడ్ అవసరం ఉందనే అభిప్రాయాలూ ఇప్పటినుంచో ఉన్నాయి. అది వెంటనే కార్యరూపం దాల్చితే ఖమ్మం నగరానికి ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఇప్పటికే దీనిపై మంత్రి కసరత్తు చేస్తున్నారు. అఖిల పక్షం నేతలు ఎంపీ నామ నాగేశ్వరరావు ను కలిసి పాతబస్ స్టాండ్ ను కొనసాగించాలని కోరారు. అయన ఈ విషయాన్నీ అధికారాల దృష్టికి తీసుకపోతానని అన్నారు. దీనిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.కరపత్రాలు , సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు లాంటివి చేపట్టారు. అధికారులను కలుస్తున్నారు . జిల్లా మంత్రి తలుచుకుంటే తప్ప బస్ స్టాండ్ విషయంలో పరిస్కారం దొరకటం సాధ్యం కాదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. సిపిఎం కు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ అఫ్రోజ్ సమీనా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం అవుతున్నాయి. కాంగ్రెస్, తెలుగు దేశం, దీనిపై ఇప్పటికే ఆందోళనలు చేపట్టాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది ఒక సమస్యగా మారుతుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Related posts

కేసును ఎదుర్కొనేందుకు నారా లోకేశ్ సిద్ధంగా ఉండాలి: మంత్రి కన్నబాబు!

Drukpadam

బొత్స‌, అంబ‌టి వ్యాఖ్య‌లు బాధాక‌రం: తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ!

Drukpadam

క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు పలు సూచనలు చేసిన సీఎం జగన్!

Drukpadam

Leave a Comment