ఘోరం …ఘోరం… ఛత్తీస్ ఘడ్ లో జవాన్ల మధ్య కాల్పులు నలుగురి మృతి!
దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య గొడవ కాల్పులకు దారితీసింది
తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులోని లింగంపల్లి బేస్‌క్యాంపులో ఘటన
తీవ్ర ఘర్షణకు దారితీసిన వాగ్వివాదం
చికిత్స పొందుతున్న మరో ముగ్గురు పరిస్థితి విషమం
భద్రాలచం ఏరియా ఆసుపత్రిలో చికిత్స</span>
మెరుగైన వైద్యానికి రాయ్‌పూర్‌కు హెలికాప్టర్ లో తరలింపు
<span style="font-size: 14pt; color: #ff0000;">
ఛత్తీస్ ఘడ్ అడవుల్లో ఘోరం జరిగింది. మావోయిస్టు ల వెరివేత కోసం విధులు నిర్వహిస్తన్న సీఆర్‌పీఎఫ్ 50వ బెటాలియన్ జవాన్ల మధ్య సెలవుల విషయంలో వచ్చిన తగాదా ఘర్షణను చివరికి కాల్పులకు దారితీసింది. ఫలితంగా 4 జవాన్లు మరణించారు .మరో ముగ్గురు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం .
దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. ఫలితంగా నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పరిధిలోని లింగంపల్లి బేస్‌క్యాంపులో ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీపావళి సెలవుల విషయంలో సీఆర్‌పీఎఫ్ 50వ బెటాలియన్ జవాన్ల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వివాదం తీవ్ర ఘర్షణగా మారింది. అది మరింత ముదరడంతో సంయమనం కోల్పోయిన జవాన్లు పరస్పరం కాల్పులకు తెగబడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.ఈ ఘటన కు సంబందించిన వివరాలను బస్తర్ ఐ జి సుందర్ రాజ్ ధ్రువీకరించారు. సత్తీష్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా మారాయిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిఆర్‌పిఎఫ్ 50 బెటాలియన్ లింగంపల్లి బేస్ క్యాంపులో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా సెలవు విషయంలో జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సెలవు దక్కలేదన్నా కోపంతో రితేష్ రంజన్ అనే జవాను తోటి జవాన్లపై సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 నిముషాలకు తన దగ్గర ఉన్న తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని లింగంపల్లీ నుండి హెలికాప్టర్‌లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న క్రమంలోనే మరో జవాను మృతి చెందాడు. మృతి చెందిన జవాన్లలో ధంజీ, రాజీవ్ మండల్, ధర్మేంధ్ర కుమార్‌లు ,రాజమని కుమార్ మండల్ గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో గాయాల పాలైన ధనంజయ్ సింగ్, ధర్మాత్మ కుమార్, మలైయా రంజన్ మహారాణాలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు రాయ్‌పూర్ ఆసుపత్రికి హెలికాప్టర్‌లో తరలించారు.
ఇలాంటి ఘటన మళ్లీ జరగకూడదు: సీఎం
ఈ ఘటనపై సీఎం భూపేష్ బఘెల్ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. సుక్మా జిల్లా మారాయిగూడ లింగాలపల్లి సీఆర్పీఎఫ్ క్యాంపు వద్ద జవాన్ జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందడం చాలా బాధాకరమని, దురదృష్టకరమని ట్వీట్ ద్వారా తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.