పి వీ కుమార్తె వాణి దేవి పోటీపై రసవత్తర చర్చ…
-ఆమెకు గవర్నర్ కోట కింద నామినేట్ చెయ్యచ్చు కదా ? అంటున్న విపక్షాలు
-ఓడిపోయో సీట్లో పోటీ పెట్టి అవమాన పరుస్తున్నారని వ్యాఖ్యలు
-మిగతా పార్టీలు రంగం నుంచి తప్పుకోవాలంటున్న మంత్రి తలసాని
హైద్రాబాద్ , రంగారెడ్డి , మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలలో టీఆర్ యస్ వ్యూహాత్మకంగా బరిలోగి దిగుతుంది. టీఆర్ యస్ నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని తన అభ్యర్థిగా ప్రకటించింది . దేశానికి విశేష సేవలు అందించిన పీవీ నరసింహారావు కుమార్తెకు సీటు ఇచ్చినందున మిగతా పార్టీలు అభ్యర్థులు పోటీనుంచి తప్పుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనడంతో మిగతా పార్టీలు స్పందించాయి. ఇది రసవత్తర చర్చకు దారితీసింది. ఒకరిపై మతాల యుద్ధం కొనసాగిస్తున్నారు. అసలు హైద్రాబాద్ , రంగారెడ్డి , మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పోటీ పెట్టాలా వద్ద అని ఆలోచించిన టీఆర్ యస్ ఎట్టకేలకు పీవీ కుమార్తె కు టికెట్ ఇవ్వడంపై ప్రతిపక్షపార్టీలు విమర్శల దాడి చేస్తున్నాయి. పీవీ కుటుంబాన్ని గౌరవించాలనుకుంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వవచ్చు కదా ? లేదా రాజ్యసభకు పంపవచ్చు కదా అంటున్నారు. పీవీ మనవడు బీజేపీ నేత సుభాష్ మాట్లాడుతూ కేసీఆర్ ఓడిపోవే ఎమ్మెల్సీ సీటు ఇచ్చి తనపిన్నమ్మ ను అవమాన పరుస్తున్నాడని అన్నారు. కేవలం బ్రామ్మన ఓట్లు చీల్చేందుకే ఆమె పోటీపెడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ధికోసమే ఆమెను బరిలో దించుతున్నారని అన్నారు. ఆమెకు నిజంగా సీలు ఇవ్వాలనుకొంటే ఎమ్మెల్సీ గా గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అవకాశం ఉన్న ఎందుకు పోటీ పడుతున్నారని ప్రశ్నించారు. ఓడిపోవే సీటు ఇచ్చి పీవీ కుటుంబాన్ని అవమాన పరచొద్దని అన్నారు. కేసీఆర్ రాజకీయ జిమ్మిక్కులలో ఇదో భాగమని ఆయన అన్నారు.
previous post
next post