పార్టీ విరాళాల సేకరణలో టాప్ లో ఉన్న టీఆర్ యస్ ,టీడీపీ ,వైసీపీ!
-ఇండియాలో టాప్ వన్ లో టీఆర్ఎస్, రెండు ,మూడు స్థానాల్లో టీడీపీ, వైసీపీ!
-విరాళాల సేకరణలో టాప్ త్రీలో తెలుగు రాష్ట్రాల పార్టీలు
-2019-20లో టీఆర్ఎస్ కు వచ్చిన విరాళాలు రూ. 89 కోట్లు
-టీడీపీకి రూ. 81 కోట్లు.. వైసీపీకి రూ. 74 కోట్లు
దేశంలోనే విరాళాల సేకరణలో టాప్ లో మన తెలుగు పార్టీలు ఉన్నట్లు ఏ డి ఆర్ అనే సంస్థ వెల్లడించింది. దక్షిణాదిన అందులో తెలుగు రాష్ట్రాలలో ఉన్న పార్టీలు ముందు ఉండటం గమనార్హం . ఓటర్లకు డబ్బులు పంచడంలో కూడా మనరాష్ట్రాలు ముందు ఉన్నాయి. ఎన్నికల కోడ్ , నియమనిబంధనలు ఎన్ని ఉన్నప్పటికీ డబ్బు పంపకం ఆగడం లేదు . ఎన్నికల సంఘం నిఘానేత్రాలు ఉన్న అక్రమాలు నిరోధించలేక పోతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సంఘం కఠినమైన నిర్ణయాలు తీసుకోని ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయాలనీ ప్రజలు కోరుకుంటున్నారు. వివరాల సేకరణ కూడా బలవంతపు వసూల్ లేదా కిడ్ ప్రోకో లో బాగానే ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ రాజకీయ పార్టీలు విరాళాల సేకరణలో చాలా ముందున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో అత్యధిక విరాళాలను సేకరించిన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్ఎస్ తొలి స్థానంలో, టీడీపీ రెండో స్థానంలో, వైసీపీ మూడో స్థానంలో నిలిచాయి. విరాళాల రూపంలో టీఆర్ఎస్ కు రూ. 89 కోట్లు, టీడీపీకి రూ. 81 కోట్లు, వైసీపీకి రూ. 74 కోట్లు వచ్చాయి. ఈ వివరాలను ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది.
ఇదే ఏడాది దేశంలోని మొత్తం 25 ప్రధాన ప్రాంతీయ పార్టీలకు రూ. 803.24 కోట్ల విరాళాలు వచ్చినట్టు ఏడీఆర్ తెలిపింది. వీటిలో రూ. 445.77 కోట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చాయని వెల్లడించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన విరాళాల్లో 95 శాతం ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే వచ్చాయని తెలిపింది.