Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రంతో కేసీఆర్ లొల్లి ఓ డ్రామా… రేవంత్

కేంద్రంతో కేసీఆర్ లొల్లి ఓ డ్రామా.. చిత్తశుద్ధి ఉంటే ఆయనెందుకు ఆ పనిచేయలే..: రేవంత్
-ధర్నాలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్న
-కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేయాలనిడిమాండ్..
-టీఆర్ఎస్, బీజేపీలు తోడు దొంగలేనని ఫైర్
-ధనిక రాష్ట్రమైన తెలంగాణ రైతుల వడ్లు ఎందుకు కొనలేదు
-ప్రజా చైతన్య యాత్ర వాయిదా వేసినట్లు వెల్లడి

రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు రాజకీయ నేతల అవతారం ఎత్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ధర్నాలకు మాత్రమే అనుమతులిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిబంధనలు కాంగ్రెస్‌కేనా.. టీఆర్ఎస్, బీజేపీలకు వర్తించవా.. అని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని.. వాయిదా వేశామని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు.

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతు సమస్యలపై ఆ రెండు పార్టీలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలేనని ధ్వజమెత్తారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో సీఎం కేసీఆర్ లొల్లి అంతా వట్టి డ్రామా అని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ధర్నాలో సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. రైతుల కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆయన ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు. మోదీ ప్రధానిగా, కేసీఆర్ సీఎంగా ఉండి ధాన్యం కొనకపోతే పదవుల్లో కొనసాగడం ఎందుకని రేవంత్ ప్రశ్నించారు.

ధనిక రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయలేదా? అని రేవంత్ ప్రశ్నించారు. ధాన్యం కొనని పార్టీలకు ఓటెందుకు వేయాలన్నారు. ప్రత్యేక బడ్జెట్‌ పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం పదేళ్లు జైల్లో మగ్గిన జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం దేశ ప్రజలకు ఒక పండుగ అని అన్నారు. కొంతమంది చరిత్రను వక్రీకరిస్తూ కొత్త దేశభక్తుల అవతరమెత్తారని విమర్శించారు.

 

Related posts

ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్

Drukpadam

శరద్​ పవార్​ తో ప్రశాంత్​ కిషోర్​ భేటీ.. ‘మిషన్​ 2024’పై మంతనాలు!

Drukpadam

తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ …ప్రోత్సహించింది చంద్రబాబు : విలేకర్లతో చిట్ చాట్ లో తుమ్మల …

Drukpadam

Leave a Comment