Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈ నెల 23 వరకు కేసీఆర్ కు టైమ్ ఇస్తున్నాం: రేవంత్ రెడ్డి

ఈ నెల 23 వరకు కేసీఆర్ కు టైమ్ ఇస్తున్నాం: రేవంత్ రెడ్డి
-బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయి
-ఏసీలు పెట్టుకుని కేసీఆర్ ధర్నా చేశారు
-పోరాటం చేయాలనుకునేవాళ్లు రైతుల కళ్లాలకు వెళ్లాలి
-గత ప్రభుత్వాల సమయంలో లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది?: మల్లు భట్టి విక్రమార్క
-రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి
-వ్యవసాయరంగాన్ని కుదేలు చేయాలనుకుంటున్నారు
-ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం ధర్నాలు చేస్తోంది

రైతులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇందిరాపార్క్ దగ్గర సీఎం కేసీఆర్ ఏసీలు పెట్టుకుని ధర్నా చేశారని ఎద్దేవా చేశారు.

రైతుల పక్షాన పోరాటం చేయాలనుకునేవాళ్లు రైతుల కళ్లాలకు వెళ్లాలని అన్నారు. రేపటి నుంచి 23వ తేదీ వరకు కళ్లాలలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని చెప్పారు. ధాన్యం కొనేందుకు ఈనెల 23 వరకు కేసీఆర్ కు సమయం ఇస్తామని… ఆ తర్వాత రైతులతో కలిసి ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రైతు సమస్యలపై మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయాలి …కాంగ్రెస్

రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాదులో ఈరోజు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ వరి కొనుగోలు విషయంలో గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ సమస్య రాలేదని… ఎప్పుడూ రాని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వమే ధర్నాలు చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని అన్నారు. వ్యవసాయరంగాన్ని కుదేలు చేసి కార్పొరేట్లకు అందించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

సీతక్క మాట్లాడుతూ, కేసీఆర్ చేస్తున్నది దొంగ దీక్ష అని అన్నారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపకుండా దీక్షలకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. వడ్లను తెలంగాణ ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు.

Related posts

దేశానికి స‌రికొత్త ద‌శ‌,దిశ కోసం య‌త్నం: కేసీఆర్‌

Drukpadam

సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా కె .రామకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక!

Drukpadam

అసమర్థుడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానంటూ చెప్పుతో కొట్టుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు!

Drukpadam

Leave a Comment