Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఖమ్మం లో వరస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిపై పీడీ యాక్ట్ : పోలీస్ కమిషనర్

ఖమ్మం లో వరస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిపై పీడీ యాక్ట్ : పోలీస్ కమిషనర్!
-ప్రాపర్టీ చోరీ కేసుల్లోని ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకొన్న ఖమ్మం పోలీసులు
-హైద్రాబాద్ చంచల్ గూడ జైలుకు తరలింపు
-ప్రాపర్టీ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్ పై బయట తిరుగుతున్న ఇద్దరు నేరస్తులు
-వారు బయట ఉంటె మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్న సిపి

వరుస చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేసిన్నట్లు పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.
నగరంలోని పాకబండ బజార్ కు చెందిన షేక్ నయిమ్ 27 , మరియు తుమ్మలగడ్డకు చెందిన షేక్ ఆసిఫ్ ఖాన్ 26 .
జలసాలకు అలవాటుపడి,దొంగతనం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశ్యంతో తాళాలు వేసి ఉన్న ఇళ్ళను లక్ష్యంగా ఎంచుకొని రెక్కి నిర్వహించి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఖమ్మం- I టౌన్(3) టూ టౌన్ (01) మరియు ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ల పరిధిలో (02) మొత్తం (06)ఇళ్ళ ప్రాపర్టీ చోరీ కేసుల్లో నిందుతులుగా వున్నారని తెలిపారు.

ఇలాంటి నేరగాళ్లు బయట తిరుగుతున్నంతకాలం దొంగతనాలు, నేరాలను అదుపు చేయడం కష్టాసాధ్యమని, అందుకే ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ)యాక్ట్‌ నిందితులపై అమలు చేసినట్లు తెలిపారు. నేరాలు ప్రవృత్తిగా మార్చుకొని దొంగతనాలు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే నేరగాళ్ళపై నిఘా పెట్టామని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని, నిందుతులపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ప్రాపర్టీ దొంగతనాల కేసుల్లో రిమాండ్ అయి ఇటీవల బెయిల్ పై విడుదలైన నిందితులు తిరిగి నేరాలు చేసే ఆవకాశం వున్నందున ఈ నిందుతులపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు తెలిపారు.

ఖమ్మం వన్ టౌన్ సిఐ చిట్టిబాబు తన సిబ్బందితో కలసి నిందుతులను ఈరోజు హైదరాబాదు చంచల్ గూడ సెంట్రల్ జైలు తరలించారు. సెంట్రల్ జైలు అధికారులను కలసి పిడీ యాక్ట్ కాపీలను అందజేసి నిందుతులను అప్పగించారు.

Related posts

వివేకా హత్య కేసులో సునీల్ సోదరుడు సంచలన కామెంట్స్!

Drukpadam

విశాఖ మన్యం లో కాల్పుల కలకలం …గంజాయి స్మగ్లర్లను తీసుకెళుతున్న వాహనంపై దాడి…

Drukpadam

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్.. రూ. 5.70 కోట్ల బదిలీ!

Drukpadam

Leave a Comment