Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ స్టేట్ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాయల నాగేశ్వరరావు రాజీనామా..

తెలంగాణ స్టేట్ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాయల నాగేశ్వరరావు రాజీనామా..
-స్థానిక సంస్థల ఖమ్మం అభ్యర్థిగా పోటీచేయడమే కారణం
-రాజీనామా లేఖను కార్యదర్శికి పంపిన రాయల
-ఇండస్ట్రీ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఉంటాయని వెల్లడి

జిల్లా కాంగ్రెస్ నాయకులు ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా పోటీచేస్తున్న రాయల నాగేశ్వరరావు రాష్ట్ర గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. చాలాకాలంగా ఆయన తెలంగాణ స్టేట్ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. జిల్లా గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కూడా ఆయన పనిచేశారు. జిల్లా గ్రానైట్ పరిశ్రమ విస్తరించడంతో కృషి చేసిన అతికొద్దిమందిలో ఆయన ఒకరు . సౌమ్యడు గా , అందరిని కలుపుకుని పోయే వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. మొదటినుంచి రాజకీయాలమీద మక్కువ ఉన్న నాగేశ్వర్ రావు , మొదట సిపిఎం రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఆయన తండ్రి రాయల వెంకటేశ్వర్లు సిపిఎం లో పాలేరు డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు.కొంతకాలం వరకు సిపిఎం రాజకీయాలకు దూరంగా ఉన్న వెంకటేశ్వర్లు , తిరిగి సిపిఎం కు దగ్గర అయ్యారు. నిబద్దత గల కుటుంబ నేపథ్యం. రాజకీయాలమీద ఉన్న ఆశక్తి తోనే 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరి పాలేరు నియోజకర్గం నుంచి పోటీ చేసారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయింది. అప్పడు నాగేశ్వర్ రావు కూడా కాంగ్రెస్ లో చేరారు . నాటి నుంచి కాంగ్రెస్ లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకసందర్భంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా కూడా ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. గ్రూప్ ల గందరగోళంలో ఆయన కొంత సైలంట్ అయ్యారు. అయినప్పటికీ రేణుక చౌదరి కి అత్యంత నమ్మకస్తుడుగా , భట్టికి దగ్గరగా ఉంటూ అందరికి తలలో నాలుకలా ఉన్నారు. వివాద రహితుడిగా ఆయనకు మంచి పేరుంది. కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఓట్లు ఎక్కువ లేనప్పటికీ ఆయన పోటీకి దిగడం విచిత్రంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏదైనా మిరకిల్ జరిగితే తప్ప ఆయన గెలుపు అసాధ్యమనే చెప్పాలి……..

Related posts

ఎన్నికలను నిర్వహించడానికి ఇదొక్కటే సురక్షిత మార్గం: ప్రశాంత్ కిశోర్

Drukpadam

ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు తెరవెనుక …ఇప్పుడు తెరముందుకు!

Drukpadam

అక్టోబ‌ర్ 24న తెలంగాణ‌లోకి రాహుల్ గాంధీ యాత్ర‌…

Drukpadam

Leave a Comment