Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మహిళతో ఎస్సై అక్రమ సంబంధం… ఎస్సైని ఉతికారేశారు!

  • వనపర్తి ఎస్సై ఘనకార్యం
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మహిళ భర్త
  • కొట్టొద్దని ప్రాధేయపడిన ఎస్సై
  • గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన వైనం
  • సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

వనపర్తి జిల్లాలో ఓ పోలీసు అధికారి బాధ్యతలు మరిచి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోగా, ఆ మహిళ భర్త, అతడి స్నేహితులు సదరు ఎస్సైకి దేహశుద్ధి చేశారు. వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో షేక్ షఫీ ఎస్సైగా పనిచేస్తున్నాడు. కొత్తకోటకు చెందిన ఓ మహిళతో ఎస్సై షఫీ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం మహిళ భర్తకు తెలిసింది. దాంతో అతడు పక్కా ప్లాన్ వేసి ఎస్సైని, తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇందులో అతడికి స్నేహితులు కూడా సహకరించారు.

ఇంకేముంది… ఆ ఎస్సైని ఉతికారేశారు. కొట్టొద్దని ఎస్సై ఎంత వేడుకున్నా మహిళ భర్త, అతని స్నేహితులు చితకబాదారు. ఎస్సైని ఏమీ అనవద్దంటూ భార్య అడ్డురాగా, భర్త లాగిపెట్టి గూబ గుయ్యిమనిపించాడు. ఇంతలో పోలీసులు రావడంతో ఆ ఎస్సై బతికిపోయాడు! గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి అక్రమ సంబంధం వ్యవహారం అధికారులకు తెలియడంతో విధుల నుంచి సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Related posts

ఖతర్‌‌ను వీడి.. ఆఫ్ఘనిస్థాన్‌కు పయనమైన తాలిబన్ అగ్రనేత!

Drukpadam

సీబీఐ వస్తే జగన్ కాళ్లు వణుకుతున్నాయ్.. ప్యాంటు తడిచిపోతోంది: నారా లోకేశ్!

Drukpadam

దక్షిణ ఢిల్లీలో మాంసం దుకాణాలు బంద్.. అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం!

Drukpadam

Leave a Comment