Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కల్లుగీత కార్పొరేషన్ కు 5 వేల కోట్లు కేటాయించాలి…కె జి కె యస్ డిమాండ్ !

కల్లుగీత కార్పొరేషన్ కు 5 వేల కోట్లు కేటాయించాలి
కల్లుకు కెసిఆర్ ప్రచార కర్త కావాలి
గీతన్న బందు ఇవ్వాలి .
బెల్లంకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి.

రాష్ట్రంలో కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 5 లక్షల కుటుంబాల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్ కు 5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంచికంటి ఫంక్షన్ హాల్ లో సంఘం జిల్లా అధ్యక్షుడు బోడపట్ల సుదర్శన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశం జరిగింది,
ముఖ్యఅతిథిగా రాష్ట్రకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారు హాజరై వారు ప్రసంగించారు తరతరాల నుండి వృత్తి చేస్తూ ప్రభుత్వానికి పన్నులు కడుతూ స్వయం ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు,
ప్రభుత్వ లిక్కర్ పాలసీ వలన రోజు రోజుకి వృత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు,తెలంగాణ ప్రభుత్వం లిక్కర్,బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారిస్తూ గీత కార్మికులకు పూర్వవైభవం తెస్తాం అనడం విడ్డూరంగా ఉందన్నారు,
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
మద్యనిషేధం అమలు చేయాలని అన్నారు.ప్రతీ సొసైటీకి 5 ఎకరాల భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలని అన్నారు,సభ్యులైన ప్రతి ఒక్కరికి బైక్ లు ఇవ్వాలని,కల్లుగీత వృత్తిదారులకు గీతన్న బంధు పేరుతో 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు, * ఎక్స్ గ్రేషియా 10 లక్షలకు పెంచాలని,మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని, అర్హులైన వారందరికీ సభ్యత్వం, గుర్తింపు కార్డులు కొత్త జిల్లాల పేరుతో ఇవ్వాలని కోరారు,కల్లు ఆరోగ్యానికి మంచిదని ఔషద గుణాలున్నాయని జాతీయ పోషకాహార సంస్థ ప్రకటించినందున దీనికి మార్కెట్ సౌకర్యం కలగాలంటే ముఖ్యమంత్రి KCR ప్రచార కర్తగా ఉండాలని కోరారు, విధంగా డిసెంబర్ 10 .11 .హైదరాబాదులో జరిగే కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి అంజయ్య సంఘం సీనియర్ నాయకులు బొల్లికొండ పాపయ్య చిట్టి మొదు నాగేశ్వరరావు బొడ్డు నరసింహారావు మొక్క నాగేశ్వరరావు మరికంటి శ్రీను కొండం కరుణాకర్ ఆలూరి కోటయ్య మోట పోతుల వెంకటేశ్వర్లు రెడ్డి మల్ల వెంకటయ్య పొట్లపల్లి హుస్సేన్ జలగం వెంకట్రావు ఉద్దగాని శ్రీనివాసరావు మరికంటి నాసర్ గౌడ్ పోలే బోయిన నరసింహారావు బొడ్డు జోగేశ్వరరావు మొక్క నాగేశ్వరావు తదితరులు జిల్లా కమిటీ సభ్యులు హాజరయ్యారు.

Related posts

మంగళూరు సమీపంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

Drukpadam

యాదాద్రిపైకి ప్రైవేట్ వాహ‌నాల నిషేధం..నిత్య కైంక‌ర్యాల వేళ‌లు ఇవే!

Drukpadam

భారత దగ్గుమందుపై ఆఫ్రికా ఆరోపణలు మనకు సిగ్గుచేటు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి!

Drukpadam

Leave a Comment