పెన్షనర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!
-రిటైర్డ్ ఉద్యోగుల హర్షం ….
-వేతన బకాయిలు జనవరి 22 నుంచి 36 వాయిదాలలో చెల్లింపు
-జీవో నెంబర్ 1406ను ప్రభుత్వం విడుదల
తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు .చాలాకాలంగా పెండింగ్ లో ఉన్నాయి వాటిని వెంటలే చెల్లించాలని కోరుతూ ఉద్యోగులు సీఎం కేసీఆర్ ను కోరుతున్నారు . వరి విన్నపాన్ని మన్నించిన ప్రభుత్వం పెన్షనర్లకు చెల్లించాల్సిన వేతనాలు చెల్లించేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అంగీకరించారు.అయితే వారికీ రావాల్సిన బకాయిలను 36 వాయిదాలలో చెల్లించనున్నారు .
తెలంగాణ రాష్ట్రంలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌తో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు పెన్షనర్లకు పెరిగిన వేతనాలను 36 వాయిదాలలో చెల్లించడానికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు జీవో నెంబర్ 1406ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో విడుదల పట్ల రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన వేతన బకాయిలు జనవరి 22 నుండి పొందడానికి ఉత్తర్వులు ఇచ్చారు.