Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కామ్రేడ్స్ ఓట్ల కోసం మాజీ కామ్రేడ్స్ ప్రయత్నాలు …

కామ్రేడ్స్ ఓట్ల కోసం మాజీ కామ్రేడ్స్ ప్రయత్నాలు …
కామ్రేడ్స్ చేయందుకుంటారా ? కారెక్కుతారా ??
ఖమ్మం జిల్లాలో కామ్రేడ్స్ ఓట్లు కీలకం
100 కి పైగానే కామ్రేడ్స్ ఓట్లు

 

కామ్రేడ్స్ ఓట్లకోసం మాజీ కామ్రేడ్స్ ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించారు. అనుకోసం వారి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముందుగా వచ్చితి ,మున్ముందుగా వచ్చితి నేనే అన్న చందంగా వారి వ్యవహారం ఉంది. అయితే కామ్రేడ్స్ మాత్రం ఎవరికీ తమ మద్దతు ఉంటుందో చెప్పలేదు . ఎవరికీ వారు తమకు సహకరించేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పుకుంటున్నారు. టీఆర్ యస్ ఒకడుగు ముందుకు వేసి సిపిఐ తమకు మద్దతు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసిందని ప్రకటించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీఆర్ యస్ కు రెండు వంతుల మైజార్టీ ఉన్నా ఎందుకో ఓట్లు తారు మరు అవుతాయనే సందేహం …అందుకే తమపార్టీకి చెందిన ఓట్లను ఎటు పోకుండా కాపాడు కోవడంతోపాటు , పక్క పార్టీల ఓట్ల కోసం గాలం వేస్తున్నారు . ఇందుకోసం క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మొదట ఎంపీటీసీ ,జడ్పీటీసీ లను కౌన్సిలర్లను కార్పొరేటర్లను గోవా తరలించాలని టీఆర్ యస్ నిర్ణయించింది. కానీ ఎందుకో మనసు మార్చుకొని హైద్రాబాద్ శివార్లకు తరలించాలని నిర్ణయించుకుంది . కాంగ్రెస్ ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు .కానీ వారు కూడా తమ ఓట్లర్లను తరలించాలనే యోచనలో ఉన్నారు .

విచిత్రమేమంటే టీఆర్ యస్ , కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తాతా మధు , రాయల నాగేశ్వర్ రావు ఇద్దరు మాజీ కామ్రేడ్స్ కావడం విశేషం . ఒకప్పుడు ఇద్దరు సిపిఎం లో కీలకంగా పని చేసినవారే కావడం గమనార్హం . వారు ఇప్పుడు టీఆర్ యస్ ,కాంగ్రెస్ పార్టీలనుంచి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఒకేసామాజికవర్గానికి చెందిన ఇద్దరుకి నీతి, నిజాయతి పరులుగానే పేరుంది. కాకపోతే ఒకరిది భారీ మనస్తత్వం ,మరొకరిది ఆచితూచి అడుగేసే స్వభావం . ఒకరిది గ్రానైట్ ఇండస్ట్రీ నేపథ్యం కాగా మరొకరికి స్టేట్స్ లో హోటల్ వ్యాపారాలు ఉన్నాయి.

ఇప్పడు ఇరువురు ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడుతున్నారు. స్థానికసంస్థల్లో మొత్తం 669 ఓట్లు ఉన్నాయి. అందులో ఎవరు మొదటి ప్రాధాన్యతలో 339 ఓట్లు తెచుకుంటారో వారిది గెలుపు అవుతుంది. లెక్క ప్రకారం టీఆర్ యస్ కు 497 ఓట్లు ఉన్నాయి. గెలుపు సునాయాసమే కావాలి ….అయితే అవుతుందా? లేదా అనే డౌట్ … ప్రతిపక్షాలకు అన్నిటికి కలిపి 250 ఓట్లు ఉన్నాయి. కానీ ప్రతిపక్షాలలో ఐక్యత అంతంత మాత్రమే …. టీఆర్ యస్ ఓడి పోవాలని అందరు కోరుతున్నా ఐక్యత దగ్గరకు వచ్చే వరకు అది కనిపించడం లేదు . అందువల్ల పక్కాగా గెలుస్తాడనుకున్న టీఆర్ యస్ అభ్యర్థి తాతా మధు ,అందరు సహకరిస్తే గెలుస్తాననే అభిప్రాయంతో ఉన్న రాయల నాగేశ్వర్ రావు లు ఇద్దరు సిపిఐ ,సిపిఎం న్యూడెమోక్రసీ ఓట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. టీఆర్ యస్ అభ్యర్థి తాతా మధు ఇప్పటికే సిపిఐ ,సిపిఎం కార్యాలయాలకు వెళ్లి వారి సహకారాన్ని అభ్యర్థించారు. రాయల నాగేశ్వర్ రావు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. రెండు పార్టీలు ఇతిమిద్దంగా మీకే మద్దతు ఇస్తామని గాని ఓట్లు వేయిస్తామని గానీ చెప్పలేదు . పార్టీ లో చర్చించి చెబుతామన్నారు. రాష్ట్ర పార్టీల నిర్ణయం మేరకే అవి నడుచుకుంటాయి.

Related posts

మళ్లీ మనసు మార్చుకున్న సినీ నటి దివ్యవాణి.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన!

Drukpadam

కర్నూలులో చంద్రబాబు ఆవేశం చూసి బాధేసింది: యనమల!

Drukpadam

మునుగోడులో మాతో పని లేదు..కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

Drukpadam

Leave a Comment