Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేసి రాయల నాగేశ్వరరావు ను గెలిపించండి :సీఎల్పీ నేత భట్టి!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేసి రాయల నాగేశ్వరరావు ను గెలిపించండి :సీఎల్పీ నేత భట్టి!
-స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన టీఆర్ యస్ ను ఓడించండి
-ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు కట్టిపెట్టి రైతులను ఆదుకోవాలి

ఖమ్మం స్థానికసంస్థల ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాయలనాగేశ్వరరావు ను గెలిపించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన టీఆర్ యస్ ను ఓడించాలని అన్నారు. ఏరకంగా చుసిన తమపార్టీ అభ్యర్థి అందరికంటే మెండుగా స్థానిక సంస్థల బలోపేతానికి కృషిచేస్తారని అన్నారు. చట్టసభల్లో స్థానిక సంస్థల వాయిస్ వినిపించగలిగేది తామేనని భట్టి అన్నారు. ఎన్నికలను ఒక సరుకుగా చేసి డబ్బు సంచులతో ఓట్లను కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీఆర్ యస్ కు బుద్ది చెప్పేందుకు స్థానిక సంస్థల ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ , స్థానికసంస్థల బలోపేతం కోసం చట్టం తెచ్చింది కాంగ్రెస్ కాగా వాటిని నిర్వీర్యం చేసి అధికారాలు లేకుండా కేవలం ఓట్ల కోసమే వారిని ప్రలోభపెట్టే చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు. రాయల నాగేశ్వరరావు గెలుపు ద్వారా ఖమ్మం జిల్లా చరిత్రను లిఖించాలని అన్నారు. అనేక ఉద్యమాలకు , చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఖమ్మం స్థానిక సంస్థల ప్రతినిధులు తమకు వచ్చిన అవకాశాన్ని సరైన అభ్యర్థికి ఓటు ఇవ్వడంద్వారా నిరూపించుకోవాలని అన్నారు. ఎవరి ఓటు ఎవరికీ వేస్తున్నారనేది ఎవరికీ తెలియదని అన్నారు. కొంతమంది ఎవరికీ ఓటు వేస్తారో తెలిసిపోంతుందనే ప్రచారం చేస్తున్నారని అందువల్ల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు , కౌన్సిలర్లు , కార్పొరేటర్లు ఆత్మప్రభోదానుసారం ఓటువేసి రాయల నాగేశ్వరరావు ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ , నగర అధ్యక్షుడు జావేద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తమిళనాడులో మళ్లీ మొదలైన వర్ష బీభత్సం… నెక్ట్స్ మన వంతు..?

Drukpadam

హుజురాబాద్ లో రాజకీయ తుఫాన్… కాంగ్రెస్ కు పార్టీకి గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి!

Drukpadam

పంట పొలాల్లో కాలవ గట్లను దూకుతూ సాగిన చంద్రబాబు… 

Drukpadam

Leave a Comment