కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్!
ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష
ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం మన్న డీహెచ్ శ్రీనివాసరావు
ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కేసు లేదు
ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు
కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు విమాశ్రయాల్లో పరీక్షలు
మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటికే వివిధ దేశాలలో దీనిపై అప్రమత్తం కావడంతో రాష్ట్రంలోని ముందు జాగ్రత్తలు చేపట్టాలని నిర్ణయించారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ పట్ల ప్రభుత్వం అప్రమత్తతతో ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ కేసులు దేశంలో నమోదు కాలేదన్నారు. సౌత్ ఆఫ్రికా, బొట్స్వానా, హాంగ్‌కాంగ్‌తో పాటు పలు యూరోపియన్ దేశాల్లో ఒమిక్రాన్ గుర్తించారన్నారు.
ఆయా దేశాల కొత్త వేరియంట్ రాకుండా అడ్డుకునేలా విమానాశ్రయాల్లోనే పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జీనోమ్సీక్వెన్సింగ్ చేసే ప్రక్రియను బలోపేతం చేసినట్లు చెప్పారు. ఆయా దేశాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేకంగా ఇండ్లకు తరలించి, పాజిటివ్‌గా తేలిన వారికి 14 రోజుల హోం క్వారంటైన్‌కు తరలించడంతో పాటు మానిటరింగ్ చేయనున్నట్లు వివరించారు. కొవిడ్ వైరస్‌లో వివిధ వేరియంట్లతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుంచి వ్యాక్సినేషన్ ఒక్కటే కాపాడగలదన్నారు. రాష్ట్రంలో కేసులు కరోనా పెరగడం లేదని, నిలకడగానే ఉన్నాయన్నారు.
దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు ఆదివారం సమావేశం అయ్యారు . కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. ఇదే అంశంపై ఇటీవల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రియా నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానాలు లేని కారణంగా ముంబయి, దిల్లీలో దిగి భాగ్యనగరానికి వచ్చే వారిని ట్రేసింగ్, టెస్టింగ్ సహా పలు అంశాలపై చర్చించనున్నారు..