Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

‘మిస్టర్ పీఎం నరేంద్ర మోదీ గారు.. దయచేసి వినండి’ అంటూ ఒమిక్రాన్‌పై కేజ్రీవాల్ ట్వీట్!

‘మిస్టర్ పీఎం నరేంద్ర మోదీ గారు.. దయచేసి వినండి’ అంటూ ఒమిక్రాన్‌పై కేజ్రీవాల్ ట్వీట్!
అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపేయాలి
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది
ఈ విష‌యంలో ఆలస్యం చేయకూడ‌దు

క‌రోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఇప్ప‌టికే ప‌లు దేశాల‌కు వ్యాప్తి చెందిన అంశంపై ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మ‌రోసారి స్పందించారు. మిస్ట‌ర్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గారూ అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపేయాల‌ని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

ఈ విష‌యంలో ఆలస్యం చేయకుండా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని చెప్పారు. ద‌క్షిణాఫ్రికా స‌హా ఒమిక్రాన్ కేసులు ఉన్న‌ దేశాల నుంచి ఇప్ప‌టికే అనేక దేశాలు విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, మరి భార‌త్ ఎందుకు ఆలస్యం చేస్తోంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కరోనా మొదటి ద‌శ విజృంభ‌ణ స‌మ‌యంలో కూడా విమానాల రాకపోకలపై నిషేధం విధింపులో ఆలస్యం చేశామ‌ని ఆయ‌న చెప్పారు.

అంతర్జాతీయ విమానాల్లో అధిక శాతం ఢిల్లీలో దిగడం వల్ల ఢిల్లీ నగరం ఆ వైర‌స్ వ‌ల్ల‌ ఎక్కువగా ప్రభావితమవుతోందని ఆయ‌న చెప్పారు. పీఎం సారు దయచేసి విమానాల రాక‌పోక‌ల‌కు ఆపాల‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెంద‌కుండా ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసూ లేదు: కేంద్ర ఆరోగ్య మంత్రి

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సమాధానం
దాని నివారణ, కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి
జన్యు పరిక్రమాన్ని విశ్లేషిస్తున్నామని కామెంట్

దేశంలో ఇప్పటిదాకా ఒక్క ‘ఒమిక్రాన్’ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఇవాళ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఈ కరోనా కొత్త వేరియంట్ 14 దేశాలకు వ్యాపించిందని చెప్పిన ఆయన.. ప్రస్తుతానికైతే మన దేశంలో లేదని తెలిపారు. అది రాకుండా నివారించేందుకు, వచ్చినా కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు.

వేరియంట్ కు సంబంధించిన జన్యు పరిక్రమాన్ని విశ్లేషిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణలోనే ఉందని, అయితే అది మాత్రం ఇంకా పోలేదని తెలిపారు. ఇప్పటిదాకా 124 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను వేశామన్నారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ చాలా డేంజరంటూ నిన్న డబ్ల్యూహెచ్ వో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచానికి పెను ముప్పు తప్పదని, మరిన్ని వేవ్ లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Related posts

రాష్ట్రంలో కేసులు తక్కువగా చూపిస్తున్నారు … రేవంత్ రెడ్డి…

Drukpadam

ఎమ్మెల్సీ పదవి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నాననడం హాస్యాస్పదం: ఎల్.రమణ!

Drukpadam

ఇంకా భ్రమల్లో బతుకుతున్న కాంగ్రెస్ …బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మోడీ ధ్వజం…

Drukpadam

Leave a Comment