Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో ఏజన్సీలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యటన…

మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో ఏజన్సీలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యటన…
-మావోయిస్టుల పై ఉక్కుపాదం మోపెందుకు సమీక్షా సమావేశం.
-రహస్యంగా సాగిన డిజిపి మహేందర్ రెడ్డి టూర్
-ఏజెన్సీ లోకి ఆర్ టిసి బస్సులు నిలిపివేత.
-ప్రజాప్రతినిధులు అనుమతులు లేకుండా పర్యటించోద్దంటూ పోలీసులు సూచనలు.
-ఏజెన్సీ లో హై ఆలర్ట్
-రేపటి నుండి ఈనెల 8 వరకు వారోత్సవాలు

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన చర్ల మండలం చెన్నాపురంలో డిజిపి మహేందర్ రెడ్డి అత్యంత రహస్యంగా పర్యటించారు . ఆయన పర్యటన అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది.అడుగడుగునా పోలీస్ నిఘా ఏర్పాటు చేశారు. ఎవరో వి వి ఐ పి వస్తున్నారని అనుకున్నారు గాని స్వయంగా డీజీపీ వస్తున్నారనే విషయాన్నీ పోలీసులు వెల్లడించలేదు . ఏజన్సీ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు లను కూడా తిరగకుండా నిలిపి వేశారు. అంతకు ముందు భద్రాచలంలోని సారపాక గూస్ట్ హౌస్ కు చేరుకున్న డీజీపీ కి భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు ఘన స్వాగతం పలికారు. సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ ఎస్ పిలతో డీజీపీ సమావేశం నిర్వహించారు. ఏజన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వారికీ సూచనలు చేశారు .

మావోల వారోత్సవాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత పెంచాలని పోలీస్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. సరిహద్దు ప్రాంతాలలో అనుమానితులను, మావోయిస్టు కార్యకలాపాలు కు చెక్ పెట్టేందుకు డిజిపి వారితో చర్చించారు . తెలంగాణ, చత్తీస్‌గఢ్ అంధ్రా సరిహద్దులలో నిఘా పెంచాలన్నారు

జిల్లా పోలీసు అధికారుల పనితీరు భేష్ : డీజీపీ మహేందర్ రెడ్డి ఐపీఎస్

తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం పర్యటించారు.హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్ నుండి సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ నకు చేరుకున్న డిజిపికి జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ స్వాగతం పలికారు.జిల్లా పోలీసు అధికారులతో జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యంపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ సారధ్యంలో పోలీసు అధికారులు ప్రజల సహకారంతో అభివృద్ధి నిరోధకులైన మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకోవడంలో సమర్ధవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అతి తక్కువ కాలంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో కూడా జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ పనితీరు అభినందనీయం అని అన్నారు.జిల్లా పోలీసు అధికారులు స్పెషల్ పార్టీ కమాండోలు బాధ్యతగా తమ విధులును నిర్వరిస్తూ నిషేధిత మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ వి.తిరుపతి,ఏఆర్ అడిషనల్ ఎస్పి శ్రీనివాసరావు,ఏఎస్పీలు శబరీష్ ఐపీఎస్,వినీత్ ఐపీఎస్,రోహిత్ రాజు ఐపీఎస్,అక్షాన్ష్ ఐపీఎస్ మరియు ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వివాదంలో చిక్కుకున్న సాయిపల్లవి..

Drukpadam

మేరియుపోల్ ను వశం చేసుకున్న రష్యా… సైన్యాన్ని అభినందించిన పుతిన్!

Drukpadam

వైసీపీ నాలుగో జాబితా విడుదల.. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఔట్!

Ram Narayana

Leave a Comment