గోవా పర్యటనకు మంత్రి పువ్వాడ..
-ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు
-ఎలక్ట్రిక్ వాహనాల వైపే అడుగులు
-కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొననున్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు
కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొననున్నారు .ఇందుకోసం ఆయన రెండు రోజులు పాటు గోవా రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహం మరియు పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, సాంకేతిక నిపుణుల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.
కేంద్ర భారీ పరిశ్రమలు మంత్రిత్వ శాఖ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు డిసెంబర్ 4న గోవా రాష్ట్రంలోని లాలిట్ గోల్ఫ్ & స్పా రిసార్ట్, కెనకోనాలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొననున్నారు.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) నూతన పాలసీని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి 2020-2030 కాలానికి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన విధానాలను వెల్లడించారు. ఇప్పటికే దేశం లో ఎలక్ట్రిక్ వాహనాల వైపు ద్రుష్టి సారించిన ప్రభుత్వం ప్రోత్సాహాలు కూడా ప్రకటించింది. అనేక కంపెనీ లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మొగ్గుచూపుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన టెస్లా లాంటి కార్ల కంపెనీ దేశంలో వాహనాలు విక్రహించేందుకు సిద్ద పడింది. కేద్రం అద్వర్యం లో జరిగే సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన నున్నారు.