Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శిగా తిరిగి నున్నా నాగేశ్వరరావు…

సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శిగా తిరిగి నున్నా నాగేశ్వరరావు…
-45 మందితో జిల్లా కమిటీ …11 మందితో కార్యదర్శి వర్గం
-పార్టీ జిల్లా కమిటీ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు నున్నా వెల్లడి
-ప్రజల పక్షాన ,ప్రజల కోసం పోరాటాలు మరింత ఉదృతం చేస్తాం
-ఖమ్మం జిల్లాలో ఐ టి డి ఏ కార్యాలయం ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి

రెండు రోజులపాటు జరిగిన ఖమ్మం జిల్లా సిపిఎం మహాసభల్లో జిల్లా పార్టీ కార్యదర్శిగా తిరిగి నున్నా నాగేశ్వరరావును ఎన్నుకున్నారు. ఆయనతోపాటు 45 తో జిల్లా కమిటీని 11 మందితో జిల్లా కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నట్లు నున్నా నాగేశ్వరరావు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లా కమిటీలో వివిధ వర్గాలు , సామజిక సమీకరణలతో జిల్లా కమిటీ ఎంపిక మహాసభల్లో వివిధ అంశాలకు సంబందించిన 17 తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా జిల్లాలో ఐ టి డి ఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనీ ,అదే విధంగా ప్రభుత్వ విద్య కళాశాల ,రైతులకు గిట్టు బాటు ధరలు పై తీర్మానాలు ఆమోదించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో భవిషత్ పోరాటాలు పార్టీ విస్తరణ పై చర్చించినట్లు తెలిపారు.

కరోనా తో మృతి చెందిన కుటంబాలకు 4 లక్షల సహాయం అందించాలని , 16 రకాల నిత్యావసరాలను వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఇవ్వాలని మహాసభ తీర్మానించింది అని అన్నారు. జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోవాలని ,పంటలు నష్ట పోతున్న రైతులను ఆదుకోవాలని జీఎస్టీ ,పెద్ద నోట్ల రద్దతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను కాపాడాలని , మూతపడ్డ పరిశ్రమలను తెరిపించాలని ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని మహాసభ డిమాండ్ చేసింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ , ఉపకార వేతనాలు ఇవ్వాలని , జిల్లాలో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనీ తీర్మానించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ,నిరుదోయగ భృతి ఇవ్వాలని ,ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలనీ సభలో డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు , యర్రశ్రీకాంత్ , బండి రమేష్ , కళ్యాణం వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.

 

Related posts

మా సీట్లు తేల్చండి …లేదంటే చెప్పండి …బీఆర్ యస్ కు లెఫ్ట్ పార్టీల అల్టిమేటం ….

Drukpadam

కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసన…రేపు మౌనదీక్ష చేపట్టనున్న బండి సంజయ్!

Drukpadam

పులివెందుల సభలో జగన్ పై చంద్రబాబు విసుర్లు ..తన సభకు వెల్లువలా జనం రావడంపై సంతోషం …

Ram Narayana

Leave a Comment