ఒమిక్రాన్ వైరస్ ఎఫెక్ట్… మాస్క్ ధరించకపోతే రూ1,000/- ఫైన్ …తెలంగాణ ప్రభుత్వం!
రాష్ట్రంలో ఒక కేసు …ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి
శానిటైజ్ చేసుకోవాలి … రద్దీ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలి
దక్షిణాఫ్రికా ను అతలాకుతలం చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిన్న యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ 35 ఏండ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన స్పష్టం చేశారు. మాస్కు ధరించకపోతే నేటి నుంచి పోలీసులు ₹1000/_ జరిమానా విధిస్తారని తేల్చిచెప్పారు. మాస్కు ధరించడంతో పాటు, సానిటైజర్ వాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు.
ముప్పు ఎప్పుడైనా రావొచ్చు
ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ కట్టడిపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాల్సిందేనని లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదని, తప్పనిసరిగా అందరూ కొవిడ్ టీకా రెండు డోసుల తీసుకోవాలి.
ఒమిక్రాన్ నివారణకు మన వంతు ప్రయత్నం చేయాలి. జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పుడు జరుగుతున్న అసత్య ప్రచారాలే వాస్తవాలవుతాయి. ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది.
మొదటి వేవ్ రెండవ వేవ్ లో చేసిన నిర్లక్ష్యం, పొరపాట్లు, తప్పిదాలు, ఇప్పుడు చేయకండి. జీవితాన్ని, ఫ్యామిలీ ని, సమాజాన్ని కాపాడేందకు సహకరించండి.
మాస్క్ తప్పనిసరి చేస్తూ తెలంగాణా ప్రభుత్వం వుత్తర్వులు జారీ. ఆఫీసులు, షాపులు, మాల్స్, సినిమా హాల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, స్కూల్స్, కాలేజీలు, మసీదులు మందిరాలు, చర్చి లకు సంబంధించిన అధికారులు, వాటి బాధ్యత వహించే వారు వారి వారి పరిసరాలకు వచ్చే వారిని మాస్క్ లేకుండా లోనికి అనుమతించ కూడదు. ఒక వేళ ఆయా పరిసరాల్లో ఎవరికైనా వైరస్ సోకిన యెడల సదరు పరిసర బాధ్యతగల వారిపై అధికారుల పై చర్యలు తీకనబడును.