Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికలు టీఆర్ యస్ కు సవాల్…

స్థానిక సంస్థల ఎన్నికలు టీఆర్ యస్ కు సవాల్…
-ఖమ్మం , వరంగల్ , ఆదిలాబాద్ లలో రసవత్తర పోటీ
-డైలమాలో ఓటర్ ….పార్టీల ఆకర్షణ మంత్రం
-ఆకర్షణ మంత్రం పని చేస్తుందో లేదా అనే సందేహం
-ఆచితూచి అడుగులు …క్యాంపులకు ఓటర్లు
-ఓటర్లకు కన్విన్సింగ్ చేసేందుకు ప్రయత్నాలు

స్థానిక సంస్థల ఎన్నికలు అధికార టీఆర్ యస్ కు సవాల్ గా మారాయి. ఇప్పటికే కొన్ని ఏకగ్రీవం అయినప్పటికీ మరికొన్ని జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికలు ప్రతిష్ట్మాకం అయ్యాయి. ఈ ఎన్నికలు చిన్నవే అయినా ఫలితం పెద్దగా ఉండటం దీనికి కారణం . పూర్తీ మెజార్టీ ఉంది ఒక్క సీటు ఓడిపోయినా అది టీఆర్ యస్ పై కేసీఆర్ పాలపై పెద్ద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి . అభ్యర్థుల ఎంపికను కేసీఆర్ చేసి గెలిపించే భాద్యతను స్థానిక మంత్రులమీద పెట్టడం పెద్ద ఇబ్బందిగా మారింది . స్థానిక సంస్థల నుంచి ఎవరైతే గెలుస్తారు ? అందరిని కలుపుకుని పోయే శక్తి ఎవరికుంది ?స్థానిక నాయకులను ఎవరు సమన్వయం చేయగలరు ? అనేది చూడకుండా తాము అభ్యర్థులను ఎంపిక చేశాము కాబట్టి మీరు ఓట్లు వేయాల్సిందే అనే విధంగా ఉంది పరిస్థితి . అంతే కాకుండా ఎన్నికైన ఎంపీటీసీలు , జడ్పీటీసీ లు కౌన్సిలర్లు , కార్పొరేటర్లు తమకు అధికారాలు లేవని, పనులు కావడంలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఎన్నికైతే తమకు అధికారాలు లేకపోవడం, ఎంపీటీసీలకు ఎంపీడీఓ కార్యాలయాల్లో వారికీ కుర్చీలు కూడా లేవనే వేదన వారిలో ఉంది. వారికీ అధికారాలు లేకపోవడం ,బడ్జెట్ కేటాయింపుల్లో వారి మాట చెల్లుబాటు కాకపోవడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. దీంతో అధికార పార్టీలో ఉన్నా తమను ఎవడు పట్టించుకున్న వాడు లేడని వాపోతున్నారు. స్థానిక సంస్థల్లో తమకు ఓటు హక్కు ఉండటంతో తాము చుట్టూ తిరుగుతూ పలకరిస్తున్నారని తప్ప లేకపోతె తమవైపు కూడా చూడరని వారు అంటున్నారు . 10 వ తారీఖు తరువాత తమను ఎవరు పట్టించుకోరని అందువల్ల తాము ఓటు ఎవరికి వేయాలి ? ఎందుకు వేయాలి అనే మీ మాంసంలో ఉన్నారు. దీంతో ఓటరు పూర్తిగా న్యూట్రల్ అయ్యాడు . వారిని ఒప్పించు మెప్పించేందుకు పార్టీలు సిద్ధమైయ్యాయి. ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు ప్రకటించేందుకు సిద్ధపడుతున్నాయి.

తెలంగాణాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్ , ఆదిలాబాద్ ,ఖమ్మం జిల్లాల్లో ఎన్నికలు అధికార పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెట్టేలా ఉన్నాయి. ఇక్కడ అధికార పార్టీకి క్లియర్ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రత్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ఓటర్ డైలమాలో ఉన్నారు. అధికార పార్టీ కి చెందిన ఓటర్లు అసంతృప్తి తో ఉన్నారు . దీంతో పార్టీలు ఆకర్షణ మంత్రం చేపట్టాయి. వాళ్లకు రకరకాల ఎరలు చూపుతున్నాయి. అయినప్పటికీ ఆకర్షణ మంత్రం పని చేస్తుందో లేదో అనే సందేహాలు వెంటాడుతున్నాయి. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాయకులకు సైతం అంతుపట్టని విధంగా ఎంపీటీసీ లు , జడ్పీటీసీ లు , కౌన్సిలర్లు , కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఓటర్లను క్యాంపులకు తరలించారు. అక్కడ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వచ్చాయి. వారిని కన్విన్స్ చేసేందుకు నాయకులూ పడరాని పట్లు పడుతున్నారు. అవి ఎంత వరకు సక్ స్సెస్ అవుతాయి అనే సందేహాలు ఉన్నాయి.

 

Related posts

షర్మిల బీజేపీ వదిలిన బాణమేనా …?

Drukpadam

జిల్లాలో స్వతంత్ర, ఐక్య పోరాటాలు సారథిగా సిపిఎం…

Drukpadam

లిక్కర్ …లీకుల చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు …

Drukpadam

Leave a Comment