Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఒమిక్రాన్ దృష్ట్యా కర్ణాటకలో కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం…

ఒమిక్రాన్ దృష్ట్యా కర్ణాటకలో కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం…

  • కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు
  • రెండు కేసులు బెంగళూరులోనే నమోదు
  • రెండు డోసులు తీసుకుంటేనే బహిరంగ ప్రదేశాల్లో అనుమతి
  • విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు తప్పనిసరి

కర్ణాటక ను లో రెండు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చుసిన నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రమంతటా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. వ్యాక్సిన్ రెండు రోజులు వేసుకొని వారు వెంటనే వేసుకోవాలని లేని వెడల వారిని బహిరంగ ప్రదేశాల్లో తిరగటాన్ని నిషేదించింది. రాష్ట్రంలోకి వచ్చేవారిని క్షుణంగా పరిశీలన చేసేందుకు బస్సు స్టాండ్ రైల్వే స్టేషన్ లలో నిఘా ఏర్పాటు చేసింది. అంతే కాకుండా విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు లేకుండా ఎంట్రీ లేదు . బయట నుంచి వచ్చే వ్యక్తులకు ఎయిర్ పోర్ట్ లోనే పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతానికి నైట్ కర్ఫ్యూ లేదు కానీ పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

కర్ణాటకలో ఇప్పటికే ఇద్దరికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ రెండు కేసులు బెంగళూరులోనే వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలకు తెరలేపింది. ప్రత్యేకంగా కొవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికే కార్యాలయాలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, పార్కుల్లోకి అనుమతించనున్నారు.

అటు, విద్యార్థుల తల్లితండ్రులకు రెండు డోసులు తప్పనిసరి చేసింది. భారీ వేడుకలు, కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్యను 500కి పరిమితం చేసింది. విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందేనని ఆదేశించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రస్తుతానికి రాత్రిపూట కర్ఫ్యూ విధించలేదని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.

Related posts

దేశంలో కరోనా పరిస్థితులపై నోరు మూసుకుని కూర్చోలేం: సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

Drukpadam

కరోనా లెక్కల్లో తెలంగాణ సర్కార్ అంకెల గారడీ …50 వేల పరిహారంతో ప్రజల గగ్గోలు!

Drukpadam

లాఠీపట్టడమే కాదు … సహాయం చేయడంలో మిన్న దటీజ్ సజ్జనార్

Drukpadam

Leave a Comment