Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

అజాజ్ పటేల్ ఒక్క‌డే 10 వికెట్లు ప‌డ‌గొట్టిన వైనం… పుట్టినగడ్డపైనే పులకింత!

అజాజ్ పటేల్ ఒక్క‌డే 10 వికెట్లు ప‌డ‌గొట్టిన వైనం… పుట్టినగడ్డపైనే పులకింత!

  • ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో టెస్టు మ్యాచ్
  • 150 ప‌రుగులు చేసిన మ‌యాంక్
  • శుభ‌మ‌న్ గిల్ 44, అక్ష‌ర్ ప‌టేల్ 52 ప‌రుగులు
  • తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 ప‌రుగులు
team india score

ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో భార‌త్-న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ బౌల‌ర్ అజాజ్ ప‌టేల్ చెల‌రేగాడు. టీమిండియాలోని అన్ని వికెట్లు ఆయ‌న‌కే ద‌క్కాయి. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఇన్నింగ్సులో 10 వికెట్లు తీసిన మూడో ఆట‌గాడిగా నిలిచాడు. మ‌రోవైపు, టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్, అక్ష‌ర్ ప‌టేల్, శుభ‌మ‌న్ గిల్ త‌ప్ప ఇత‌ర బ్యాట్స్ మెన్ రాణించ‌లేక‌పోయారు.

మయాంక్ అగ‌ర్వాల్ 150 ప‌రుగులు చేశాడు. ఇక శుభ‌మ‌న్ గిల్ 44, చ‌టేశ్వ‌ర్ పూజారా 0, విరాట్ కోహ్లీ 0, శ్రేయాస్ అయ్య‌ర్ 18, వృద్ధిమాన్ సాహా 27, అశ్విన్ 0, అక్ష‌ర్ ప‌టేల్ 52, జ‌యంత్ యాద‌వ్ 12, ఉమేశ్ యాద‌వ్ 0 (నాటౌట్), సిరాజ్ 4 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. మొత్తం 10 వికెట్లు అజాజ్ ప‌టేలే తీయ‌డం గ‌మ‌నార్హం. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించింది.

న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ పుట్టింది ముంబయిలోనే. అజాజ్ పటేల్ 1988 అక్టోబరు 21న జన్మించాడు. అయితే కుటుంబ రీత్యా న్యూజిలాండ్ కు వలసవెళ్లిన పటేల్… అక్కడే క్రికెట్ లో ఉన్నతస్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఏకంగా అద్భుతమైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అది కూడా తాను పుట్టినగడ్డపైనే చిరస్మరణీయమైన రీతిలో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు సాధించి అచ్చెరువొందించాడు.

టెస్టుల్లో ఈ ఘనతను ఇంతకుముందు జిమ్ లేకర్ (ఇంగ్లండ్), అనిల్ కుంబ్లే (భారత్) సాధించారు. వారి తర్వాత ఓ ఇన్నింగ్స్ లో 10 వికెట్లు సొంతం చేసుకుని అజాజ్ పటేల్ చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నాడు.

Related posts

ముంబై దాటికి కోల్ కత్తా విలవిలా….!

Drukpadam

‘హరికేన్ బెరిల్’ ఎఫెక్ట్‌తో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమిండియా.. రంగంలోకి బీసీసీఐ!

Ram Narayana

ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న హైద్రాబాద్ యువతి ఇషా సింగ్ ..

Ram Narayana

Leave a Comment