Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఐకమత్యానికి ప్రతీక సాముహిక వనభోజనాలు మాజీ ఎంపీ పొంగులేటి!

ఐకమత్యానికి ప్రతీక సాముహిక వనభోజనాలు మాజీ ఎంపీ పొంగులేటి
రామాలయ అభివృద్ధికి పొంగులేటి లక్ష విరాళం
పలు శుభకార్యాలలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఆదివారం ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని బోనకల్, ఖమ్మం పట్టణం, కొణిజర్ల, సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ, చింతకాని మండలాల్లో పర్యటించారు.

ప్రస్తుత కంప్యూటర్ యుగంలో అలనాటి రోజులను గుర్తుచేసుకొనే విధంగా గ్రామ ప్రజలు అందరూ కలసి కులమతాలకు అతీతంగా సాముహిక వనభోజనాలు నిర్వహించుకోవటం గొప్ప విషయమని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిధిగా ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా రామాపురం గ్రామంలోని రామాలయంలో మాజీ ఎంపీ పొంగులేటి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అర్చకులు, గుడి చైర్మన్ పొంగులేటికి తీర్ధప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం రామాలయం అభివృద్ధిలో భాగంగా తన వంతు సహాయంగా రూ.లక్ష రూపాలయను పొంగులేటి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను, వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు అభివాదం చేస్తూ వారిని పలుకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సర్పంచ్ తొండపు వేణు, రామాపురం గ్రామ ప్రజలను, నిర్వాహకులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, రామాలయ చైర్మన్ బంధం అచ్చయ్య, బోనకల్ సర్పంచ్ భుక్యా సైదులు నాయక్, ఉమ్మినేని కృష్ణ, చిన్న బీరవెల్లి పేరుశాంతయ్య, కిరణ్, సాధినేని రాంబాబు, బోయినపల్లి మురళి, గొడుగు కృష్ణ, నల్లిబోయిన కృష్ణ, బీరెల్లి వాసు, గొగినేని ప్రదీప్, చిట్టిమొదు శ్రీను, గాదె నరోత్తమ రెడ్డి, గుర్రం వెంకటేశ్వర్లు, గడిపుడి రామకృష్ణ, బంధం కృష్ణ, దిద్దుబోయిన నాగయ్య, నల్లమోతు సత్యనారాయణ, గుడిపుడి వెంకటేశ్వర్లు, ఇరుగు నాగభూషణం, మామిళ్ల కృష్ణయ్య,జవ్వాజి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం పట్టణంలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

ఖమ్మం : ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం పట్టణంలో పర్యటించారు. కార్తీకమాసం సందర్భంగా జలాంజనేయస్వామి దేవస్థానంలో చైర్మన్ చిన్ని రాజ్ కుమార్, కార్పోరేటర్ శ్రావణి-సుధాకర్ దంపతులు, పారా శ్రీను, సంపత్ కుమార్ ఏర్పాటు చేసిన కుంకుమపూజ, అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంజాల వెంకటేశ్వర్లు మనుమడు, మనుమరాళ్ల పంచకట్టు, ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. బొందిలి సత్యనారాయణ సింగ్ కుమార్తె వివాహం సందర్భంగా పెళ్లి కుమార్తెను దీవించి నూతన వస్త్రాలను అందజేశారు. తమ్మిశెట్టి పరశురామ్ పిల్లల పంచెకట్టు, ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం మలీదు వెంకటేశ్వర్లు తల్లి వరమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పొంగులేటి వెంట వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, జిల్లా టీఆర్ఎస్ నాయకులు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కీసర వెంకటేశ్వరరెడ్డి, నాయకులు కోసూరి శ్రీను, రాయల పుల్లయ్య, అనంతరెడ్డి, చెల్లా రామకృష్ణారెడ్డి, దారావత్ రాంబాబు, కనగంటి రావు, దుంపల రవి కుమార్, చింతమళ్ల గురుమూర్తి, కొనకంచి మోషే, సైదులు గౌడ్, మరికంటి కృష్ణ, ప్రసాద్, రఫీ, యువనేత గోపి, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో పర్యటించారు. గుండ్ల రామారావు కుమారుని వివాహం వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. షేక్ జానిమియా ఇంట్లో జరిగిన వేడుకలో పాల్గొని చిన్నారులను దీవించారు. పొంగులేటి వెంట వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, నాయకులు కోసూరి శ్రీను, రాయల పుల్లయ్య, దారావత్ రాంబాబు, కనగంటి రావు, కొనకంచి మోషే, ఏలూరి శ్రీను, అద్దంకి చిరంజీవి, వెంకటప్పయ్య, షేక్ జానిమియా, రామకోటయ్య, నరేందర్, బాబులాల్, దేవేందర్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల కుటుంబాలకు పొంగులేటి ఓదార్పు

ఆదివారం ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చింతకాని మండలంలో పర్యటించారు. కోమట్లగూడెం గ్రామంలో శీలం నర్సిరెడ్డి చనిపోయినందున ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చింతకాని మండల కేంద్రంలో షేక్ రంజాన్ (మండల కో-ఆప్షన్ సభ్యులు) ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొదుమూరు గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురైనందున ఆయన పలుకరించి ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బస్వాపురం గ్రామంలో కొండలరావు చనిపోయినందున వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి ఓదార్చారు. గాంధీనగర్ గ్రామంలో చర్చి పాస్టర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా పలు కుటుంబాలకు పొంగులేటి ఆర్ధిక సహాయంను అందజేశారు. పొంగులేటి వెంట టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కోట రాంబాబు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, సొసైటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, కిలారు మనోహర్, కన్నెబోయిన సీతారామయ్య, కోలేటి సూర్య ప్రకాష్ రావు, మంకెన రమేష్, బాబుల్ రెడ్డి, వేముల నర్సయ్య, మందడపు శ్రీను, ఉమ్మినేని కృష్ణ, బూరుగడ్డ లక్ష్మీనారాయణ, కాలంగి లలిత, బొడ్డు వెంకట రామయ్య, పిన్నెల్లి శ్రీనివాస్, సోమా నాగేశ్వరరావు, షేక్ ఖాసిమ్ సాహెబ్, జోనబోయిన వీరబాబు, షేక్ సిలార్ సాహెబ్, నారపోగు వెంకటేశ్వర్లు, బొగ్గారపు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పార్లమెంట్ లో పెగాసస్ సెగలు.. మోడీ టార్గెట్ గా విపక్షాల ఉమ్మడి పోరు…

Drukpadam

కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు …

Drukpadam

అసెంబ్లీలో భట్టి, మంత్రి హరీశ్ రావు మధ్య ‘జల’ యుద్ధం!

Drukpadam

Leave a Comment