Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మంలో ఘనంగా రజక వనమహోత్సవం!

ఖమ్మంలో ఘనంగా రజక వనమహోత్సవం!
-వేలాదిగా తరలి వచ్చిన రజకులు
-ఐకమత్యంతో ముందుకు సాగుదాం ..రజక సంఘం నాయకులు పిలుపు
-పాల్గొన్న జక్కుల లక్ష్మయ్య,తుపాకుల ఎలగొండ స్వామి పంతంగి వెంకటేశ్వర్లు

ఖమ్మం లోని గొల్లగూడెం చెరుకూరి తోటలో ఆదివారం నాడు రజక సంఘం ఆధ్వర్యంలో రాజకవన సమారాధన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. తొలుత రజకుల ఆరాధ్యదైవం మాడెలయ్య స్వామీకి పూజలు చేశారు. అనంతరం పోరాటాయోధురాలు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ వనసమారాధన కార్యక్రమంలో 10 వేలమంది రజకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సీనియర్ నాయకులు జక్కుల లక్ష్మయ్య మాట్లాడుతూ రజకులు సామాజికాంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ఆయన అన్నారు. ముది గొండ సోసిటీ అధ్యక్షులు తుపాకుల ఎలగొండ స్వామి మాట్లాడుతూ రజకులు ఐకమత్యం తో ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వహణ కమిటీని అభినందించారు.

ఈ కార్యక్రమంలో సలహాదారులు పంతంగి వెంకటేశ్వర్లు, నిర్వహణ కమిటీ సభ్యులు కణతాల నరసింహారావు, జక్కుల వెంకటరమణ, గూడెపు నాగరాజు, తమ్మారపు బ్రమ్మం,రేగళ్ల కొండల్, కాండ్రాతి వెంకటేశ్వర్లు, మణిగా కోటేశ్వరరావు, జబర్దస్త్ కళాకారిణి యోధ సిస్టర్స్, రాజు బృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Related posts

భారతీయ రెస్టారెంట్ నిర్వాహకులకు బ్రిటన్ రాకుమారుడి ఊహించని సర్‌ప్రైజ్…

Drukpadam

కొంగలపై బెంగ! అవి రాకపోవడంతో చింతపల్లి ఊరంతా చింత…

Drukpadam

రేవంత్ రెడ్డి భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు!

Drukpadam

Leave a Comment