Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రధాని మోదీ పై ఇంట బయట విమర్శల పరంపర…

ప్రధాని మోదీ పై ఇంట బయట విమర్శల పరంపర…
-దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ
-అయినా ఆగని ఎన్నికలు-ఎన్నికల ప్రచారంలో ప్రధాని ,ముఖ్యమంత్రులు
-కరోనా కన్న రాజకీయాలే ఎక్కువయ్యాయని ధ్వజం
– మోడీ ఓ సూపర్ స్ప్రెడర్ అన్న ఐఎంఏ ఉపాధ్యక్షుడు
-ఘాటుగా వ్యాఖ్యలు చేసిన డాక్టర్ నవజ్యోత్ దహియా
కరోనా నియత్రించటంలో భారత ప్రభుత్వం వ్యవహారశైలిపై ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోడీ పై విమర్శల జడివాన కురుస్తుంది. అంతర్జాతీయ మీడియా భారత్ లో కరోనా పరిస్థితులపై మొదటిసారిగా మొదటి పేజీలలో శీర్షికలతో వార్తలను ప్రచురించాయి . ప్రధాని మోడీ కరోనా వదిలి పెట్టి ఎన్నికల కోసం పర్యటనలు చేయడాన్ని తప్పు పట్టింది. కరోనా కట్టడికి జాతీయ విధానాన్ని సుప్రీం కోర్ట్ సైతం నొక్కి చెప్పింది. అనేక సందర్బాలలో వివిధ రాష్ట్రాల హైకోర్టు లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. కరోనా పరీక్షలు నిర్వహించటంలోనూ , వ్యాక్సిన్ వచ్చిన తరువాత దాన్ని అందించటంలో కేంద్రం తన భాద్యత కాదన్నట్లు చేతులు దులుపుకోవడం అనేక విమర్శలు ఉన్నాయి. మొదటి వేవ్ వచ్చినప్పుడు కొంత హడాహుడి చేసినా కేంద్రం అప్పటి అమెరిక అధ్యక్షుడు ట్రాంప్ ను స్వాగతించి లక్షల మందితో సభలు నిర్వహించడంపై కూడా మోడీ చర్యలను తప్పుపడుతున్నారు . దేశంలో మీడియా కేంద్రం తప్పుడు నిర్ణయాలను ఎత్తి చూపటంలో తన పాత్రనుంచి తప్పుకుందని విమర్శలు ఉన్నాయి . ప్రతిపక్షాలు నెత్తి నోరు మొత్తుకున్నా వారి మాటలకు తగని ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటంతో జరగలిసిన నష్టం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . రెండవ వేవ్ సందర్భంగా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలకు ప్రాధాన్యత ఇచ్చారే తప్ప కరోనా కట్టడికి చర్యలు తీసుకోక పోవడంపై అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోసింది . నాయస్థానాలు తప్పు పట్టాయి . ఆక్సిజన్ దొరకడంలేదు . వ్యాక్సిన్ కు జాతీయ విధానం లేదు . రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య వ్యాక్సిన్ ధరలలో తేడాలు ఉన్నాయి . కరోనా భాదితులకు బెడ్స్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అనేక హృదయ విదారక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొంత మంది ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కొంత మంది తమకు ఆక్సిజన్ దొరకదని ఉద్దేశంతో ఇళ్లలో పెట్టుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంబులెన్సు లు ఇదే అదునుగా పేషంట్ లను తరలించేందుకు విఫరీతంగా ఛార్జ్ లు చేస్తుండటంపై తెలంగాణ హైకోర్టు తప్పు పట్టింది .అవసరమైతే గుర్రపు బండ్లపై పేషేంట్లను తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నది . దీనిపై దేశంలోనూ వివిధ వర్గాలనుంచి విమర్శల జరీవాన కురుస్తుంది. తాజా లెక్కల ప్రకారం దేశంలో 1 కోటి 79 లక్షల 88 వేల 637 కరోనా కేసులు నమోదు కాగా 2 లక్షల 1 వేయి 165 మరణాలు సంభవించాయి . కేసులలలో అమెరికా తరువాత మనమే ఉన్నాం . మరణాలలో బ్రెజిల్ మనకన్నా ఎక్కువగా ఉంది . ప్రపంచంలోని అనేక ఆదేశాలు భారత్ కు విమాన రాకపోకలను నిలిపి వేశాయి.
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వేళ ఎన్నికలు జరుగుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజ్యోత్ దహియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీనే కరోనా వైరస్ ను ఎక్కువగా వ్యాప్తి చేసే సూపర్ స్ప్రెడర్ అని అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలు ఏర్పాటు చేశారని, కుంభమేళాకు అనుమతించారని మోదీపై ఆరోపణలు చేశారు.
“వైద్య రంగం అంతా కొవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కలిగించే యత్నాలు చేస్తున్న వేళ ప్రధాని మోదీ మాత్రం భారీ బహిరంగ సభలు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. కరోనా మార్గదర్శకాలన్నింటినీ గాలికొదిలేశారు” అని దహియా వ్యాఖ్యానించారు.
భారత్ లో తొలి కరోనా కేసు 2020 జనవరిలో నమోదైందని, ఆ సమయంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడానికి బదులు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను స్వాగతించేందుకు లక్షమందితో గుజరాత్ లో సభ ఏర్పాటు చేశారని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఈ ఏడాది పాటు వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దాంతో కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ కి చేరకముందే వైద్య ఆరోగ్య వ్యవస్థ వైఫల్యం చెందుతోందని దహియా విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా సైతం మోదీ వైఫల్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Related posts

బీజేపీకి డిపాజిట్లు కూడా రావు, అమిత్ షా సభలో ఇందులో సగం లేరు: హరీష్ రావు…

Drukpadam

మరియమ్మ హత్యపై ముఖ్యమంత్రి స్పందిక పోవడం సిగ్గుచేటు: సీఎల్పీ నేత భట్టి…

Drukpadam

కర్ణాటక సీఎం యడ్యూరప్ప కు సన్ స్ట్రోక్ తప్పదా ?

Drukpadam

Leave a Comment