Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఒక ప్రపంచం.. ఒకే ఆరోగ్యం’ విధానాన్ని అమలు చేయాలి: ప్రధాని నరేంద్ర మోదీ…

ఒక ప్రపంచం.. ఒకే ఆరోగ్యం’ విధానాన్ని అమలు చేయాలి: ప్రధాని నరేంద్ర మోదీ
జీ7 దేశాల సదస్సులో సూచన
వర్చువల్ గా మాట్లాడిన మోదీ
మేధో హక్కుల రద్దుకు మద్దతివ్వాలని విజ్ఞప్తి

 

భవిష్యత్ మహమ్మారులను నివారించేందుకు ప్రపంచ దేశాలు ఏకమవ్వాలని, ‘ఒక ప్రపంచం, ఒకే ఆరోగ్యం’ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీ7 దేశాల సదస్సులో ఆయన తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడిపోయిన భారత్ కు అండగా ఉన్న జీ7 దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

‘వసుధైవ కుటుంబం’ అన్న భారత విధానమే.. మహమ్మారి పోరాటంలో ప్రభుత్వ వర్గాలు, పరిశ్రమ వర్గాలు, పౌర వ్యవస్థలు కలిసిరావడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య విధానానికి ప్రపంచమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, దానికి తానూ కట్టుబడి ఉన్నానని చెప్పారు. కరోనా కేసుల గుర్తింపులో కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం, వ్యాక్సినేషన్ కోసం వాడిన ఓపెన్ సోర్స్ టూల్స్ చాలా విజయవంతమయ్యాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ అనుభవాలను పంచుకుంటామని చెప్పారు.

ఇక, మేధో సంపత్తి హక్కులపై వాణిజ్య సంబంధిత విషయాలపై భారత్ కు జీ7 మద్దతునివ్వాలని ప్రధాని కోరారు. ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి దేశాలు దీనికి మద్దతునిచ్చాయని, అమెరికా మాత్రం టెక్నాలజీ మార్పిడికి సంబంధించి మేధో హక్కులకు మినహాయింపునిచ్చేందుకు ఒప్పుకొందని అన్నారు .

Related posts

అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందంటే..?

Drukpadam

తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో స్వల్ప ఊరట

Drukpadam

మారిన ఖమ్మం రూపు రేఖలు …అభివృద్ధి పై మంత్రి పువ్వాడ ఫోకస్!

Drukpadam

Leave a Comment