Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జూనియర్ డాక్టర్లపై కేసీఆర్‌ ఆగ్రహం…

జూనియర్ డాక్టర్లపై కేసీఆర్‌ ఆగ్రహం…
కరోనా సమయంలో సమ్మెకు దిగడం సరికాదు
ఇలాంటి సమయాల్లో ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యతను ఇవ్వాలి
జూడాల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తాం
15 జూడాలకు శాతం వేతనం పెంచుతాం
ఆకస్మిక సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో సమ్మెకు దిగడం సరికాదని అన్నారు. ఇలాంటి కీలక సమయాల్లో ప్రజల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు.

జూనియర్ డాక్టర్ల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని ఆయన నిర్ణయించారు. అంతేకాదు, కరోనా సేవల్లో ఉన్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనమే ఇవ్వాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ స్టయిఫండ్ ను తెలంగాణ జూడాలకు ఇస్తామని తెలిపారు. కరోనా సమయంలో సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరికాదని అన్నారు.

 

జూనియ‌ర్ డాక్ట‌ర్లు వెంట‌నే స‌మ్మెను విరమించకపోతే చర్యలు కేటీఆర్ వార్నింగ్ .

.
-కరోనా మహమ్మారి సమయంలో సమ్మె చేయడం తగదు
-ఉద‌యం నుంచి జూనియ‌ర్ వైద్యుల స‌మ్మె ప్రారంభం
-రేపటి నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌లూ బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రిక‌

కొంత కాలంగా తమ సమస్యల గురించి విన్నవించుకుంటున్నప్పటికీ తెలంగాణ‌ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్ నేటి నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని సేవలను బంద్ చేసిన జూనియ‌ర్ వైద్యులు నిర‌స‌న‌లో పాల్గొంటున్నారు.

దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియ‌ర్ డాక్ట‌ర్లు చేస్తున్న స‌మ్మెను వెంట‌నే విర‌మించాల‌ని, లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయన హెచ్చ‌రించారు. క‌రోనా వేళ స‌మ్మె చేయ‌డం స‌రికాద‌ని చెప్పారు. జూనియ‌ర్ వైద్యుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంద‌ని చెప్పుకొచ్చారు. కాగా, త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై రాష్ట్ర‌ ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే రేపటి నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను కూడా బ‌హిష్క‌రిస్తామ‌ని జూనియ‌ర్ వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. కరోనా మహమ్మారి అయినందునే ఎప్పుడో చేయాల్సిన సమ్మె చాలారోజులుగా ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఇక లాభం లేదనుకొని సమ్మె చేస్తున్నామని మంత్రి తమకు వార్నింగ్ ఇచ్చే బదులు సమ్మెకు దారిని తీసిన పరిస్థిలను పరిశీలించి పరిస్కారం మార్గమే చూపాలని జూడాలు పేర్కొంటున్నారు.

Related posts

హామీలు ఇచ్చే పార్టీలు వాటిని ఎలా నెరవేరుస్తాయో చెప్పాలి: ఎన్నికల సంఘం!

Drukpadam

సంతానం లేని దంపతులు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకొనే అవకాశం:డీఎంహెచ్ ఓ!

Drukpadam

పొంగులేటి ఇళ్ళు ఆఫీసులు ,బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 33 చోట్ల ఐటీ దాడులు ..

Ram Narayana

Leave a Comment