Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ ప్రభుత్వ తప్పులు, అప్పులు, స్కాములపై మ‌హానాడులో తీర్మానం:చంద్రబాబు…

వైసీపీ ప్రభుత్వ తప్పులు, అప్పులు, స్కాములపై మ‌హానాడులో తీర్మానం:చంద్రబాబు…
-మ‌హానాడును డిజిటల్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించాంరాష్ట్రానికి పెట్టుబ‌డులు -రావ‌ట్లేదు.. యువ‌త‌కు భ‌విష్య‌త్తు లేదు: చంద్రబాబు
-రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా దౌర్జ‌న్యాలు, దోపిడీలే
-త‌ప్పుడు కేసులు పెడుతున్నారు
-అప్పులు విప‌రీతంగా చేశారు
-క‌రోనా ఎప్పుడు పోతుందో తెలియదు
-ఏది ఏమైనా వైసీపీపై పోరాడతాం
-రెండు రోజులు రేపు, ఎల్లుండి మ‌హానాడు
-అందరూ కలిసి రండి అంటూ చంద్రబాబు పిలుపు
టీడీపీ మ‌హానాడును ఈ సారి కూడా వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హించాల‌ని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యించారు. రేపు, ఎల్లుండి జ‌రిగే మ‌హానాడులో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో జరుగుతున్నా ఆరాచక పాలనపై ప్రధానంగా పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలుగు దేశం ప్రకటించింది

‘స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యక్రమాలకు ఒక మార్గ నిర్దేశం చేసుకోవడం ఆనవాయితీ. మహోత్సవంలా జరగాల్సిన మహానాడును కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించాం’ అని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.

‘మే 27, 28 తేదీలలో ఆన్ లైన్లో జరిగే ‘డిజిటల్ మహానాడు -2021’లో కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు.. తదితర అంశాలపై తీర్మానం చేయనున్నాం. అందరూ కలిసి రండి. ‘డిజిటల్ మహానాడు 2021’ను విజయవంతం చేయండి’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

 

ఏపీలో అరాచ‌క పాల‌న …చ‌ంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం

ఏపీలో అరాచ‌క పాల‌న కొన‌సాగుతోంద‌ని టీడీపీ అధినేత చ‌ంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో ఈ రోజు మాట్లాడుతూ… ‘జ‌గ‌న్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే క‌రోనా కార‌ణంగా 11 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌భుత్వ గణాంకాలు ప‌చ్చి అబ‌ద్ధం’ అని చంద్ర‌బాబు చెప్పారు.

‘రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా దౌర్జ‌న్యాలు, దోపిడీలే కొన‌సాగుతున్నాయి. హింస‌ను ప్రేరేపించే విధంగా బీసీ జ‌నార్ద‌న్‌రెడ్డి ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌పై అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ నేత‌ల‌పై త‌ప్పుడు కేసులు పెడుతున్నారు. టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డ‌కూడ‌దు’ అని చంద్ర‌బాబు చెప్పారు.

‘రాష్ట్రానికి పెట్టుబ‌డులు రావ‌ట్లేదు. అప్పులు విప‌రీతంగా చేశారు. యువ‌త‌కు భ‌విష్య‌త్తు లేదు. క‌రోనా ఎప్పుడు పోతుందో తెలియదు. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది. ఏది ఏమైనా వైసీపీపై పోరాడతాం’ అని చంద్ర‌బాబు చెప్పారు.

‘అక్ర‌మ‌ కేసులు పెడితే మ‌నం వెంట‌నే న్యాయ పోరాటం ప్రారంభిద్దాం. చ‌ట్టం అంద‌రికీ స‌మానం.. చ‌ట్టం ఎవ్వ‌రికీ చుట్టం కాదు. స్వార్థ‌పూరితంగా కొంద‌రు చ‌ట్టాన్ని వాడుకుంటే దానికి వ్య‌తిరేకంగా పోరాడ‌తాం. ప్ర‌భుత్వ బెదిరింపుల‌కు టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డొద్దు’ అని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.

‘ప్ర‌భుత్వంలో ఉన్న స‌మయంలో అభివృద్ధి కోసం టీడీపీ కృషి చేసింది. కానీ, వైసీపీ మాత్రం మాస్కులు అడిగితే డాక్ట‌ర్ల‌ను సైతం బెదిరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను కూడా ధిక్కరించి స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించారు. సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్, సీఎస్‌గా ప‌నిచేసిన వ్య‌క్తి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించి సుప్రీంకోర్టు ఆదేశాలను ప‌ట్టించుకోకుండా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఇచ్చారు. ఇటువంటి చ‌ర్య‌లు సరికాదు’ అని చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు.

‘ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకుందాం. భ‌య‌ప‌డితే దాన్ని కాపాడుకోలేం. ప్ర‌భుత్వం దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.. మెంట‌ల్‌గా మ‌నం స‌న్న‌ద్ధం కావాలి. ర‌ఘురామ‌పై కేసులు పెట్టారు. ఆయ‌న‌ను కొట్టారు. ఆయ‌నకు ఏమీ కాలేద‌ని మొద‌ట నివేదిక ఇచ్చారు. చివ‌ర‌కు ఆర్మీ ఆసుప‌త్రిలో మ‌ళ్లీ ప‌రీక్ష‌లు చేస్తే ఆయ‌న‌ను కొట్టార‌ని నివేదిక వ‌చ్చింది. వివేక మృతి కేసులో మొద‌ట సీబీఐ విచార‌ణ కావాల‌ని, ఆ త‌ర్వాత వ‌ద్ద‌ని వైసీపీ మాట్లాడింది. ఏ ఊరిలో ఏ సంఘ‌ట‌న జ‌రిగినా టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లం అంద‌రం క‌లిసి పోరాడ‌దాం’ అని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.

Related posts

రాజకీయ నాయకుడినే.. కానీ నేనూ మనిషినే: సచిన్ పైలట్

Drukpadam

రాజమండ్రి వైసీపీ లో ఇంటర్నల్ పంచాయతీ …రంగంలోకి దిగిన వై వి సుబ్బారెడ్డి!

Drukpadam

కర్ణాటకలో ప్రధాని పర్యటన బీజేపీని గట్టెక్కిస్తుందా …?

Drukpadam

Leave a Comment