Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆసుప‌త్రి నుంచి ర‌ఘురామ‌కృష్ణరాజు డిశ్చార్జ్‌.. వెంట‌నే ఢిల్లీకి పయనం…

ఆసుప‌త్రి నుంచి ర‌ఘురామ‌కృష్ణరాజు డిశ్చార్జ్‌.. వెంట‌నే ఢిల్లీకి పయనం…
సుప్రీంకోర్టు ఇటీవ‌ల‌ ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్
ఢిల్లీలో మెరుగైన వైద్య చికిత్స తీసుకోనున్న ఎంపీ
ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ర‌ఘురామ‌
రాజద్రోహం నేరారోపణలతో జైలు పాలైన నర్సాపురం వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణమరాజు కు సుప్రీం కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి విదితమే . బైలుకు సంబందించిన ఫార్మాలిటీస్ పూర్తీ చేయడంతో ఆలశ్యం జరగడంతో ఆయన విడుదల కొంత ఆలస్యం అయింది. అయి పూర్తీ అయినప్పటికీ ఒకటి రెండు రోజులు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. నేడు ఆయన ఆసుపత్రి నుంచి డీఛార్జి అయి వెంటనే ఢిల్లీకి పయనమైయ్యారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగం పేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ చేరుకున్నారు.

ఢిల్లీలో ఆయ‌న‌ మెరుగైన వైద్య చికిత్స తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించార‌నే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు కొన్ని రోజుల క్రితం రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విష‌యం తెలిసిందే.

చివ‌ర‌కు సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రిలో ఆయ‌న‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వ‌డంతో ఆయ‌న విడుద‌ల‌కు కావాల్సిన ప్ర‌క్రియ అంతా ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు పూర్తి చేశారు. ర‌ఘురామ కాళ్ల‌నొప్పితో పాటు ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.

 

ఢిల్లీ ఎయిమ్స్ కు చేరుకున్న రఘురామ
  • నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ  ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్  అయిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత వెంట‌నే బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరి ఆయ‌న ఎయిమ్స్ చేరుకున్నారు. అక్క‌డే ఆయ‌న‌ మెరుగైన వైద్య చికిత్స తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేసు గురించి మీడియాతోగానీ, సోష‌ల్ మీడియాలో గానీ మాట్లాడ‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టు ష‌ర‌తు విధించింది.

Related posts

సింగరేణి కాలనీ లో సంఘటనపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం …నిందితున్ని కచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని హెచ్చరిక!

Drukpadam

అవినీతిపరుల కూటమికి కన్వీనర్ మీరేనా? అంటూ మోదీపై ఖర్గే తీవ్ర విమర్శలు

Drukpadam

‘ఒకే దేశం ఒకే నాయకుడు అంటున్న మోడీ … ఒకే టీకా ధర’ ఎందుకు లేదు నిర్ణయించలేదు

Drukpadam

Leave a Comment