Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

‘ఒకే దేశం ఒకే నాయకుడు అంటున్న మోడీ … ఒకే టీకా ధర’ ఎందుకు లేదు నిర్ణయించలేదు

‘ఒకే దేశం ఒకే నాయకుడు అంటున్న మోడీ … ఒకే టీకా ధర’ ఎందుకు లేదు నిర్ణయించలేదు
– మమతా బెనర్జీ సూటి ప్రశ్న
-కరోనా ఉన్నా ఓటు వేయండి.. బెంగాల్‌ ఓటర్లకు మమత పిలుపు
–బీజేపీకి బుద్ది చెప్పండి
-ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను కోరిన మమత
-బీజేపీ, మోదీపై తీవ్ర విమర్శలు
-ప్రధాని ప్రసంగాలకే పరిమితమవుతారని విమర్శ

ఒకేదేశం ఒకే నాయకుడు అంటున్న మోడీ టీకా ధరను ఒకేలా ఎందుకు నిర్ణయించలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీని సూటిగా ప్రశ్నించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్ కేటాయింపులోనూ , ధరల నిర్ణయంలోనూ , ఆక్సిజన్ సరఫరాలో వ్యత్యాసాలు ఎందుకు చూపిస్తున్నారని నిలదీశారు. ఇదేనా అఖండ భారత్ నినాదం అని అన్నారు. మోడీ చేసే ప్రసంగాలకు , ఆచరణకు ఎంతో తేడా ఉందని ఆమె పేర్కొన్నారు. అనేక దేశాలకు మనం మందులు సరఫరా చేశాం . కష్ట కాలంలో ఉన్న మనకు సహాయం చేయడంలో ప్రపంచదేశాలు కొన్ని మాత్రమే ముందుకు వస్తున్న విషయాన్నీ ఆమె గుర్తు చేశారు. ఇదేనా మన దౌత్యం , మన ప్రధాని తిరిగినన్ని దేశాలు భౌహుషా మారె ప్రధాని తిరగలేదు . భారత్ కు అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చానని అనేక దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పిన ప్రధానికి కనీసం ఆక్సిజన్ సరఫరా చేసేందుకు దేశాలు ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. అమెరికా సైతం మనకు ముడిసరుకులు పంపే విషయంలో వెనుకాముందు ఆడుతున్న విషయాన్నీ ఆమె గుర్తు చేశారు. చెతన్యవంతులైన బెంగాల్ ప్రజలు అందరు ఓటు హక్కును ఉపయోగించుకొని బీజేపీ ద్వంద విధానాలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
తదుపరి విడతల ఓటింగ్‌లో కరోనా బాధితులు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరారు. నేడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వర్చువల్‌ ప్రచార కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ కేవలం ప్రసంగాలకే పరిమితమవుతారని ఆరోపించారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ ఇవ్వడంపై దృష్టి సారించి ఉంటే మహమ్మారి ప్రభావం గణనీయంగా తగ్గేదన్నారు. కేంద్రాన్ని సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కేవలం బెంగాల్‌కు మాత్రమే ఉందని దీదీ అన్నారు. అందుకే యావత్తు దేశం ఇక్కడి ఎన్నికలపై దృష్టి సారించిందన్నారు. ప్రచార కార్యక్రమాల కంటే ఎక్కువ తాను కరోనా సమీక్షా సమావేశాలే నిర్వహిస్తున్నానని తెలిపారు.

ఉత్తర్‌ప్రదేశ్‌, అసోంలో శ్మశానంలోనూ గోడలు నిర్మించారని దీదీ తెలిపారు. బెంగాల్‌లో మాత్రం అలాంటి విభజన లేదని చెప్పుకొచ్చారు. యూపీ, అసోంలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. బెంగాల్‌లో కొవిడ్‌ బాధితుల కోసం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా 60 శాతం పడకలు కేటాయించాలని ఆదేశించినట్లు తెలిపారు. ‘ఒకే దేశం.. ఒకే నాయకుడు’ అన్న నినాదంతో ముందుకెళ్తున్న మోదీ టీకాకు మాత్రం ఒకే ధర ఎందుకు నిర్ణయించలేదని ప్రశ్నించారు.

Related posts

సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ కు నిరసన సెగ…!

Drukpadam

పార్టీ పెట్టె ఆలోచన లేదు …సాగర్ లో పోటీచేయటం లేదు

Drukpadam

దేశాన్ని నాశనం చేస్తున్న మోడీ… సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని!

Drukpadam

Leave a Comment