Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా పై తమిళనాడు సీఎం పళని స్వామి అభ్యంతరం

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా పై తమిళనాడు సీఎం పళని స్వామి అభ్యంతరం
-ఈ మేరకు ప్రధానికి సీఎం పళనిస్వామి లేఖ
-మన నీళ్లు తెలుగు గంగ ద్వారా మద్రాస్ కు సరఫరా చేయటంలేదా అంటున్న తెలుగువారు
-పళని స్వామి లేఖపై తీవ్ర వ్యతిరేకత
-తమిళనాడులో 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి
-తెలుగు రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల సరఫరా
-తమిళనాడులో 310 మెట్రిక్ టన్నులు ఖర్చవుతోందన్న సీఎం
-భవిష్యత్ లో మరింత పెరుగుతుందని వెల్లడి
దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తుండడంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. వారిలో అత్యధికులకు ఆక్సిజన్ అవసరం కావడంతో దేశవ్యాప్తంగా ప్రాణవాయువు సరఫరాకు అత్యంత డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న తమిళనాడు నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అయితే తమ అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలంటూ తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
తమిళనాడు నుంచి ఏపీ, తెలంగాణకు 80 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ తరలిస్తున్నారని, ఆ సరఫరా నిలిపివేయాలని పళనిస్వామి కోరారు. తమిళనాడులోనూ కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతోందని, ఇక్కడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీ పెరంబుదూరులో ఉత్పత్తి అయ్యే 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను తెలుగు రాష్ట్రాలకు తరలించడాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు అధికంగా ఆక్సిజన్ కావాలని అడగటంలో ఎలాంటి తప్పులేదు కాని తెలుగు రాష్ట్రాలకు సరఫరాను నిలిపివేయాలని ప్రధానికి లేఖ రాయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాస్ కు మంచి నీటి అవసరాలు తీర్చేందుకు తెలుగుగంగ ద్వారా నీటిని తీసుకొని పోతున్న తమిళనాడు సీఎం ఈ విధంగా మాట్లాడటంపై తెలుగు ప్రజలు ఆగ్రంగా ఉన్నారు. తన వైఖరిని మార్చుకోవాలని పొరుగునే ఉన్న రాష్ట్రాలకు అందునా మంచినీటిని అందిస్తున్న ఆంధ్రాకు ఆక్సిజన్ సరఫరా నీలిపివేయమనటం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
తమిళనాడులో ప్రస్తుతం 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని, రాష్ట్రంలో వినియోగం 310 మెట్రిక్ టన్నులు అని పళనిస్వామి వివరించారు. కానీ కేంద్రం 220 మెట్రిక్ టన్నులే కేటాయించిందని తెలిపారు. కరోనా మరింతగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మున్ముందు ఆక్సిజన్ డిమాండ్ 450 మెట్రిక్ టన్నులకు చేరుతుందని పేర్కొన్నారు.
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోందని, తమిళనాడు కంటే తక్కువ కేసులు వస్తున్న రాష్ట్రాలోని ఉక్కు పరిశ్రమల నుంచి తయారైన ఆక్సిజన్ ను ఆయా రాష్ట్రాలు వినియోగించుకునేలా చూడాలని సీఎం పళనిస్వామి సూచించారు.

Related posts

డబుల్ మ్యూటెంట్‌కు వ్యాక్సిన్‌నుంచి తప్పించుకున్నట్లు ఆధారాలు లేవు … …సౌమ్య స్వామినాథన్‌

Drukpadam

కొవాగ్జిన్ సాంకేతికతను ఇతర సంస్థలకు బదలాయించండి: సీఎం జగన్

Drukpadam

లాక్ డౌన్ విధింపుపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Drukpadam

Leave a Comment