Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరమైన కేటీఆర్…

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరమైన కేటీఆర్…

-ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లోనే నేతలు
-ప్రచార బాధ్యతలు స్థానిక నేతలపైనే
-సిద్ధిపేటలో అన్నీ తానే అయిన హరీశ్ రావు
-ఖమ్మంలో ప్రచారం చేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్
వరంగల్ లో మంత్రులు ఎర్రబెల్లి ,సత్యవతి రాథోడ్ ,వినయ్ భాస్కర్
పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్న కేటీఆర్ కు కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ కి పరిమిత మైయ్యారు. దీంతో మినీ మున్సిపోల్ ఎన్నికలకు అయన దూరమైయ్యారు. స్థానిక నేతలకే భాద్యతలు అప్పగించారు. అయితే నిత్యం మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందరిని సమన్మయం చేస్తున్నారు. కేటీఆర్ ప్రచారంలో లేక పోవడం కొంత లోటుగానే కనిపిస్తుందని అభిప్రాయాలు ఉన్నాయి.
రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లు, మరో ఐదు మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం, మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో, ఐటీ, మునిసిపల్ మంత్రి కె. తారక రామారావు, ప్రచార కార్యక్రమాలకు దూరమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు 27 వరకే సమయం ఉండటం, రాత్రి 8 గంటల్లోపే ప్రచారాన్ని ముగించాల్సి వుండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు.

ప్రచారానికి వచ్చే అభ్యర్థులను కలిసేందుకు, వారితో మాట్లాడేందుకు ఓటర్లు కూడా పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. ఇంటింట ప్రచారం చేసేందుకే అభ్యర్థులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నిబంధనల కారణంగా ప్రచారానికి జన సమీకరణకు కూడా వీల్లేకపోయింది. ఇది పోటీలో ఉన్న వారిలో ఆందోళన కలిగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మంత్రి కేటీఆర్ పర్యటనలన్నీ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కేటీఆర్ హోమ్ క్వారంటైన్ లో ఉన్న నేపథ్యంలో, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో జరగాల్సిన రోడ్ షోలన్నీ రద్దు చేయాల్సి వచ్చింది.

దీంతో సంబంధిత కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలే బాధ్యతలను తీసుకుని, ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. పార్టీలోని క్షేత్రస్థాయి కార్యకర్తలను సమన్వయం చేసుకుని, ముందుకు సాగేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు. దీంతో వరంగల్ పరిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీ ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా, ఖమ్మం పరిధిలో మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ప్రచారం జరుగుతోంది. వీరికి తోడుగా మంత్రి సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు ప్రచారంలోకి దిగారు. ఖమ్మం లో ఎంపీ నామ ,మాజీ మంత్రి తుమ్మల సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. మొన్న జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సైతం నాయకులంతా పాల్గొన్నారు. వీరంతా స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి ఓటర్లను కలిసి, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఇక సిద్ధిపేట మునిసిపల్ పరిధిలో మంత్రి హరీశ్ రావు ఒక్కరే ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ లను కలుపుకుని ప్రచారం చేస్తున్నారు. అన్ని చోట్లా గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు కృషి చేస్తున్నారు. ,
కరోనా నేపథ్యం లో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ప్రచారం నిర్వహించటం పై కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ కొందరు ప్రముఖులు ఎన్నికల సంఘానికి లేక రాశారు. కాంగ్రెస్ పార్టీ ,ఇతరులు కోర్టుకు సైతం వెళ్లారు. కానీ కోర్ట్ ఇది తమ పరిధిలో లేదని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని కోర్ట్ వదిలేసింది. ఇప్పటికే కేసులు ఎక్కువ అవుతున్న దృష్ట్యా ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో మద్యం వేరులై పారుతుంది. మరో రెండు రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది .పోలింగ్ రోజు ఓటర్లు అందరు పోలింగ్ కేంద్రాలకు రావాల్సిఉంది. అందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే .

 

Related posts

కేసీఆర్ వ్యాఖ్యలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలయింది: కడియం శ్రీహరి!

Drukpadam

ఖమ్మం లో మంత్రి ఆగడాలు …కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ…

Drukpadam

మమతా విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువ పనిచేసింది …కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ !

Drukpadam

Leave a Comment