Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అట్టహాసంగా భూమి పూజ చేసిన కేసీఆర్!

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అట్టహాసంగా భూమి పూజ చేసిన కేసీఆర్
-1100 గజాల స్థలంలో టీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణం
-వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన
-వచ్చే ఏడాది దసరాలోగా పూర్తి చేయాలని యోచన
-టీఆర్ యస్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలు మాజీలు కూడా హాజరు
-రాష్ట్ర వ్యాపితంగా ఉత్సాహంగా జెండా పండుగ :వాడవాడన ఎగిరిన గులాబీ జెండాలు

20 సంత్సరాల నవయువకుడిగా ఉరకలు వేస్తున్న టీఆర్ యస్ పార్టీ కి పార్టీ పుట్టిన రోజునే దేశరాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం పట్ల పార్టీ శ్రేణులు హర్షితిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. అట్టహాసంగా శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. అక్కడకు హాజరైన మంత్రులు , ఎంపీలు పలువురు ఎమ్మెల్యేలు , మాజీలు సైతం కొబ్బరి కాయలు కొట్టి భూమి పూజలో పాల్గొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కార్యాలయ నిర్మాణ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ భవనానికి శంకుస్థాపన చేశారు. గురువారం నాడు ఢిల్లీ చేరిన కేసీఆర్.. వసంత్ విహార్‌లో ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ భవన్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. మొత్తం 1100 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

ఈ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతోపాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం సహా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. దీంతో ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించుకున్న అతి కొద్ది ప్రాంతీయ పార్టీల జాబితాలో గులాబి పార్టీ కూడా చేరనుంది.

ఇక ఈ భవన నిర్మాణాన్ని వచ్చే ఏడాది దసరా నాటికి ఎలాగైనా పూర్తిచేయాలనేది కేసీఆర్ యోచన. అలాగే భవన ప్రారంభోత్సవానికి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ ఢిల్లీ పర్యటన మూడు రోజులు సాగనుంది.

రాష్ట్ర వ్యాపితంగా ఉత్సాహంగా జెండా పండుగ :వాడవాడన ఎగిరిన గులాబీ జెండాలు

రాష్ట్ర వ్యాపితంగా ఉత్సాహంగా జెండా పండుగ :వాడవాడన ఎగిరిన గులాబీ జెండాలు . రాష్ట్రంలో ని అన్ని జిల్లాలో జెండా పండగను ఒక వేడుకగా టీఆర్ యస్ శ్రేణులు జరుపుకున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శాసనసభ్యుడు వెంకటవీరయ్య నాయకత్వంలో 1000 మోటార్ సైకిళ్లతో ర్యాలీ జరిగింది. గులాబీ పార్టీ ఏర్పడి 20 సంత్సరాలు పూర్తీ అయిన సందర్భంగా పలు చోట్ల మిఠాయిలు పంచుకున్నారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధికమంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.

Related posts

షిండే సీఎం కావడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్!

Drukpadam

మాకు కేసీఆర్ ఉన్నారు… ఆయనే మా ధైర్యం: మల్లారెడ్డి!

Drukpadam

హిమాచల్ ప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్!

Drukpadam

Leave a Comment