2.8 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన అఖిలేశ్ యాదవ్ అర్ధాంగి డింపుల్!

2.8 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన అఖిలేశ్ యాదవ్ అర్ధాంగి డింపుల్!

  • అక్టోబరులో ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
  • యూపీలోని మెయిన్ పురి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక
  • సమాజ్ వాదీ అభ్యర్థిగా పోటీ చేసిన డింపుల్
  • బీజేపీ నేత రఘురాజ్ సింగ్ షాక్యాపై విజయం

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అర్ధాంగి డింపుల్ యాదవ్ మెయిన్ పురి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ షాక్యాపై 2,88,461 ఓట్ల మెజారిటీతో డింపుల్ యాదవ్ గెలుపొందారు.

మెయిన్ పురి సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట వంటిది. గతంలో ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ గెలుపొందారు. అయితే అక్టోబరు 10న ఆయన కన్నుమూయడంతో, మెయిన్ పురి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది.

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ములాయం 94 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ నేత ప్రేమ్ సింగ్ షాక్యాపై గెలిచారు. ఇప్పుడాయన కోడలు అంతకుమించిన మెజారిటీతో జయభేరి మోగించడం విశేషం.

కాగా, తన భర్త అఖిలేశ్ యాదవ్ తో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన డింపుల్ యాదవ్ గెలిచినట్టు సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ ఉప ఎన్నికలో డింపుల్ కు 6,18,120 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి రఘురాజ్ సింగ్ షాక్యా 3,29,659 ఓట్లు పొందారు.

Leave a Reply

%d bloggers like this: