Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటలను ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని సవాల్ …ఈటల భార్య జమున!

ఈటలను ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని సవాల్ …ఈటల భార్య జమున!
కలెక్టర్ గులాబీ కండువా కప్పుకుంటే మంచిది
జిల్లా కలెక్టర్ పై కేసులు పెడతాం
మహిళనైన నన్ను కేసీఆర్ వేధించడం సబబు కాదు
ఈటలను రోడ్డు మీదకు తేవాలని ప్రయత్నిస్తున్నారు
ఉద్యమం కోసం భూములు అమ్ముకున్న చరిత్ర మాది

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ సంస్థ 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసిన సంగతి నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ నిన్న మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ యస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈటల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . ఈటల భూకబ్జా వ్యహారం అధికారికంగా వెల్లడైందని అన్నారు. ఇప్పుడు ఈటల ఏమంటారని ప్రశ్నించారు. కబ్జా నిజమేనని కలెక్టర్ ప్రకటించినతరువాత ముక్కునేలకు రాయాలని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై ఈటల భార్య జమున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హుజూరాబాద్ ఉపఎన్నికలో వచ్చిన ఫలితాలే వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్ల రిపీట్ అవుతాయని… ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని జమున అన్నారు. రానున్న రోజుల్లో మొత్తం 33 జిల్లాల్లో ఈటల పర్యటిస్తారని చెప్పారు. ఈటలను ఎదుర్కోవడానికి మంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత భూములను కూడా అమ్ముకున్న చరిత్ర తమదని చెప్పారు. హుజూరాబాద్ ఓటమిని జీర్ణించుకోలేక ఈటలను రోడ్డు మీదకు తేవాలని ప్రయత్నిస్తున్నారని… అది సాధ్యమయ్యే పని కాదని అన్నారు.

తప్పుడు ప్రకటన చేసిన ఆ జిల్లా కలెక్టర్ పై కచ్చితంగా కేసులు పెడతామని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, గులాబీ కండువా కప్పుకుంటే బాగుంటుందని అన్నారు. తమ వ్యాపారాలకు అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు సాక్షాత్తు అధికారులే చెపుతున్నారని అన్నారు. తమ స్థలంలో పెద్ద షెడ్లు వేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు.

తన భర్త టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలు ఒకలా వ్యవహరించారని… టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోలా ఉన్నారని జమున విమర్శించారు. టీఆర్ఎస్ కు చెందిన చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ తనను వేధించడం ఎంత వరకు సబబని అడిగారు.

 

Related posts

తదుపరి రాష్ట్రపతి ఎవరు? తేల్చనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు!

Drukpadam

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు…అసలు రహస్యమేమిటి ….!

Drukpadam

మళ్ళీ కేసీఆర్ నోట థర్డ్ ఫ్రంట్ మాట …

Drukpadam

Leave a Comment