Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యూ పీ ఎన్నికల యుద్ధం …బీజేపీపై అఖిలేష్ సైటర్లు!

యూ పీ ఎన్నికల యుద్ధం …బీజేపీపై అఖిలేష్ సైటర్లు!
-కొబ్బరికాయ కొడితే రోడ్లు పగిలిపోతున్నాయి… బీజేపీ సాధించిన అభివృద్ధి ఇదే!
-యూపీ అధికార పక్షంపై అఖిలేశ్ విమర్శలు
-అభివృద్ధిపై సీఎంను నిలదీసిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్
-ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్య
-ఈసారి ఎన్నికల్లో 400 సీట్లలో ఓటమి ఖాయమని కామెంట్

యూ పీ లో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. అధికార బీజేపీ ,ప్రధానప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది . మరికొద్దినెలల్లో యూ పీ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చింది. బీజేపీ అగ్రనేతలు యూ పీ పర్యటనలను ముమ్మరం చేశారు . ప్రధాని మోడీ సైతం యూ పీ లో పర్యటిస్తూ బీజేపీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. బీఎస్పీ ,కాంగ్రెస్ పార్టీలు ఉన్న ప్రధానపోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఎస్పీ నేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దూకుడు పెంచారు. రాష్ట్రమంతా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ పై వాగ్బాణాలు స్పందిస్తున్నారు.

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ యూపీ అధికార పక్షం బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోడ్డుపై కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పగిలిపోవడం పాత సంప్రదాయం అని, కానీ రోడ్డుపై కొబ్బరికాయ కొడితే రోడ్డే పగిలిపోవడం కొత్త సంప్రదాయం అని ఎద్దేవా చేశారు. ఇదే బీజేపీ సాధించిన అభివృద్ధి అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో తప్పుడు పాలన సాగుతోందని, ఉద్యోగాలు, విద్యారంగం అభివృద్ధి, రైతుల సమస్యలపై ప్రభుత్వం తిరోగమనంలో వెళుతోందని విమర్శించారు.

లఖింపూర్ లో రైతులపైకి జీపు దూసుకెళ్లినప్పుడు జీపులో ఉన్నది కేంద్రమంత్రి కుమారుడో, కాదో ముఖ్యమంత్రి బదులివ్వాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. ప్రజల్లో బీజేపీ అంటే తీవ్ర ఆగ్రహం నెలకొని ఉందని, ఈసారి ఎన్నికల్లో 400 సీట్లలో పరాజయం ఖాయం అని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో బీజేపీ నామరూపాల్లేకుండా పోతుందని అన్నారు. మధురలో ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

పొంగులేటి రాష్ట్రరాజకీయ క్రీడలో సమిధ కాబోతున్నారా …?

Drukpadam

పద్మభూషణ్ పురస్కారం నాకొద్దు.. తిరస్కరించిన బుద్ధదేవ్ భట్టాచార్య!

Drukpadam

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వికేంద్రీకరణకు బలాన్నిస్తున్నాయి: మంత్రి అంబటి రాంబాబు!

Drukpadam

Leave a Comment