Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పోలిసుల ఎత్తులకు అక్రమార్కుల పైఎత్తులు ..

-తెలంగాణ నుంచి ఏపీ వస్తున్న ఆటోలను ఆపి చెక్ చేస్తే…పోలీసులకే మతిపోయేలా చేశారు!
-ఆటో ట్రక్కులో ప్రత్యేక అరలు ఏర్పాటు
-పోలిసుల కళ్ళు గప్పి దర్జాగా మద్యం వ్యాపారం
-.పోలిసుల ఎత్తులకు అక్రమార్కుల పైఎత్తులు ..

పోలీసులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుటున్నా.. కొందరు కేటుగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు ఆగటం లేదు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఏపీ పోలీసులు జరిపిన తనిఖీల్లో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాళ్ల అతి తెలివికి అవాక్కయ్యారు. నిందితుల ప్లాన్ చూసి పోలీసులే షాకయ్యారు!

ట్రాలీ ఆటోలో ప్రత్యేకంగా అరలు తయారు చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా దర్జాగా మద్యం తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు రెండు ట్రాలీ ఆటోలను ఆపి తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. వారికి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు. మెల్లగా ఆటో వెనకవైపున ఉన్న ప్రత్యేక అరలు తెరచి చూశారు. అక్రమంగా తరలిస్తున్న 400 మద్యం బాటిళ్లను జి.కొండూరు మండలంలోని కందులపాడు అడ్డరోడ్ వద్ద ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే.. ఇద్దరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నుంచి ఓ ట్రాలీ ఆటోలో వెనకవైపున ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి మద్యం బాటిళ్లు నింపుకుని విజయవాడ, కొత్తూరు తాడేపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి రెండు ట్రాలీ ఆటోలను ఆపి పరిశీలించారు. ఆటో ట్రక్కులో ప్రత్యేకంగా అరను ఏర్పాటు చేసి కేటుగాళ్లు మద్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు ఆటో ట్రాలీలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. కొంతమంది అక్రమార్కులు తెలంగాణ, పలు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం బాటిళ్లను తరలించి క్యాష్ చేసుకుంటున్నారు. అయితే అక్రమ మద్యంపై ఏపీ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో.. వారి ఐడియాలు విఫలమవుతున్నాయి. కేటుగాళ్ల అతి తెలివిని ఎప్పటికప్పుడు పోలీసులు గమనిస్తూనే.. వాళ్లకు షాకిస్తున్నారు.

Related posts

కడప జిల్లా పేలుడు కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పెదనాన్న అరెస్ట్!

Drukpadam

విశాఖలో దారుణం.. బాలికపై 10 మంది అత్యాచారం

Ram Narayana

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం!

Drukpadam

Leave a Comment