Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

 వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్

  • వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం
  • ఈ తెల్లవారుజామున కన్నుమూసిన యర్రం పిచ్చమ్మ
  • రేపు మేదరమెట్లలో అంత్యక్రియలు 

వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ నేడు తెల్లవారుజామున ప్రకాశం జిల్లా ఒంగోలులో కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు.

పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి… తల్లి మరణవార్తతో హుటాహుటీన ఒంగోలు బయల్దేరారు. వైవీ తల్లికి రేపు మేదరమెట్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత జగన్… యర్రం పిచ్చమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. వైఎస్… వైవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే.


వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ (85) ఈ వేకువజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలగడం పట్ల వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. 

కాగా, వైవీ సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియలు రేపు బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఉదయం 10.30 గంటలకు జరగనున్నాయి. పిచ్చమ్మ అంత్యక్రియలకు జగన్ కూడా హాజరవుతారని తెలుస్తోంది.

Related posts

ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా నియామకం…

Ram Narayana

పాత బస్ స్టాండ్ ఉద్యమం పై మంత్రి పువ్వాడ ఆగ్రహం…

Drukpadam

18 న ఖమ్మం నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభం…

Drukpadam

Leave a Comment