బిపిన్ రావత్ ప్రమాద ఘటనపై తనదైన శైలిలో విశ్లేషించిన చైనా!
- హెలికాప్టర్ కూలిన ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ మృతి
- మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమన్న చైనా
- భారత బలగాలకు క్రమశిక్షణ తక్కువని వ్యాఖ్యలు
- చైనా గ్లోబల్ టైమ్స్ మీడియాలో కథనం
భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై చైనా స్పందించింది. రావత్ ప్రమాద ఘటన మానవ తప్పిదం కారణంగానే జరిగిందని, భారత్ లో ఇలాంటి దుర్ఘటనలు కొత్తకాదని పేర్కొంది. ప్రతికూల వాతావరణాన్ని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించి ఉన్నా, పైలెట్ నైపుణ్యవంతంగా వ్యవహరించినా, గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించి ఉన్నా ఈ ప్రమాదం జరిగేది కాదని విశ్లేషించింది.
విమానాలు, హెలికాప్టర్ల రోజువారీ తనిఖీలు, మరమ్మతులను భారత బలగాలు నిర్దేశిత ప్రమాణాల మేర నిర్వహించవని వెల్లడించింది. ముఖ్యంగా భారత బలగాల్లో క్రమశిక్షణ లోపం ఎక్కువని విమర్శించింది. ఈ మేరకు చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని వెలువరించింది.