Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుమలాయపాలెం బిడ్డకు మొదటి సారిగా చట్టసభలో అవకాశం!

తిరుమలాయపాలెం బిడ్డకు మొదటి సారిగా చట్టసభలో అవకాశం!
ఎమ్మెల్సీ గా విజయం సాధించిన పిండిప్రోలు వాసి తాతా మధు
విద్యార్ధి దశనుంచి రాజకీయాలపై మక్కువ
ఎస్ ఎఫ్ లో క్రియాశీల కార్యకర్తగా రాజకీయ ఓనమాలు
వామపక్ష ఉద్యమంలో చురుకైన పాత్ర
నిర్మాణం ,దక్షత ,పట్టుదల ఉన్న వ్యక్తిగా మధుకు పేరు

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుమలాయపాలెం మండలానికి మొదటిసారిగా చట్టసభలలో ప్రవేశించే అవకాశం దక్కింది. పిండిప్రోలుకు చెందిన తాతా మధు అధికార టీఆర్ యస్ అభ్యర్థిగా స్థానికసంస్థల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. విద్యార్ధి దశనుంచే రాజకీయాలపై మక్కువ ఉన్న మధు ఎస్ ఎఫ్ ఐ లో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసి రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారు. మధు కుటుంబం అంతా వామపక్ష ఉద్యమాలతో ఉంది. సిపిఎం లో ఉండి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. ఖమ్మం లో డిగ్రీ వరకు ఉన్నత విద్యను ఉస్మానియాలో అభ్యసించారు. ఉస్మానియా క్యాంపస్ లో ఎస్ ఎఫ్ ఐ నిర్మాణంలో మధు ,ప్రొఫెసర్ నాగేశ్వర్ తో కలిసి క్రియాశీలంగా వ్యవహరించారు. అనంతరం ఆయన అమెరికా వెళ్లారు .అక్కడ వ్యాపారులు చేసుకుంటూనే రాష్ట్ర రాజకీయాలవైపు నిరంతరం చూశారు. తొలుత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం లో చేరిన మధు అనంతర రాజకీయపరిణామాల్లో కొత్త ఆలోచనలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రావడంతో తనస్నేహితులతో కలసి తెలంగాణ ఉద్యమనానికి మద్దతుగా అమెరికా తెలుగు అసోసియేషన్ ద్వారా సహకారం అందించారు. ప్రధానంగా నల్లగొండకు చెందిన విద్యాసంస్థల అధినేత పల్లా రాజేశ్వరరెడ్డి తో స్నేహం మధు టీఆర్ యస్ వైపు ఆకర్షితులైయ్యారు. పల్లా రాజేశ్వరరెడ్డికి సీఎం దగ్గర మంచి సంబంధాలు మధు కు కలిసి వచ్చాయి. మధుకు టీఆర్ యస్ రాష్ట్ర కమిటీ లో స్తానం దక్కింది. రాష్ట్ర కార్యదర్శి గా పని చేస్తున్నారు. పార్టీ అప్పగించిన పని చేయడంలో క్రమశిక్షణ గలిగిన కార్యకర్తగా మధు సీఎం కేసీఆర్ దృష్టిలో నిలిచారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఖమ్మం నుంచి ఎవరిని పెట్టాలనే చర్చల సందర్భంగా మధు పేరు ప్రస్తావనకు రావడంతో సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మధు ఖమ్మం స్థానిక సంస్థల అభ్యర్థిగా రంగంలోకి దిగారు . అనివార్య పరిస్థిల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించడంలో జిల్లామంత్రి పువ్వాడ అజయ్ ఇతర నాయకులతో సమన్వయం చేసుకుంటూ కీలకంగా వ్యవహరించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ,జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , ఇతర ఎమ్మెల్యే లు తమ వంతు సహకారం అందించారు. దీంతో ఆయన చట్టసభల్లో ప్రవేశించే అవకాశం లభించింది.

Related posts

ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయం …ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము కు మద్దతు!

Drukpadam

తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది: మంత్రి హరీశ్ రావు!

Drukpadam

పెరిగిన ఓటింగు శాతం… అధికార పార్టీకి ఎదురుగాలి…

Drukpadam

Leave a Comment