తెలంగాణ వార్తలు

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

  • ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
  • ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం
  • గతంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేసిన ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎర్రబెల్లి స్వర్ణకు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆమె వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేశారు.

2002లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికైన ఎర్రబెల్లి స్వర్ణ, నగరానికి మొట్టమొదటి మహిళా మేయర్‌గా సేవలు అందించారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా కూడా గతంలో బాధ్యతలు నిర్వర్తించారు. ఎర్రబెల్లి స్వర్ణను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమించడంతో  కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు ఎలాంటి గ్యాప్ లేదు …గవర్నర్ తమిళశై…!

Ram Narayana

ఏప్రిల్ 22 వరకు భగభగే.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక…

Ram Narayana

పాలాల్లో దొరికిన వేలాది కోళ్లు.. విచారణలో వెలుగులోకి కొత్త కోణం!

Ram Narayana