Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే౼ మంత్రి పువ్వాడ!

ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే౼ మంత్రి పువ్వాడ.
-ప్రతిపక్షాల కుట్రలను రాజకీయాలకు అతీతంగా తిప్పికొట్టారు.
-జిల్లాలో తిరుగులేని శక్తిగా టి ఆర్ యస్
-గెలుపుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, టి ఆర్ యస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు..
-12కు 12 ఎమ్మెల్సీ స్థానాల తెరాస కైవసం పట్ల హర్షం.

స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థి తాతా మధుసుధన్ విజయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడుస్తుందని స్పష్టం అయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. అందుకు సహకరించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు టి ఆర్ యస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్పు విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టు అని పువ్వాడ అన్నారు.

ఆరు స్థానాలలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులు తాతా మధు, భానుప్రసాదరావు, రమణ, విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డిలకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టే విదంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా టి ఆర్ యస్ ను బలపరిచినందుకు ఓటర్లకు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో టి ఆర్ యస్ కి పెరుగుతున్న ప్రజాదరణకు ఇది దిక్సూచి అని ఆయన చెప్పారు. ఈ విజయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టి ఆర్ యస్ పార్టీ బలోపేతమైన శక్తిగా రూపొందిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం, టిఆర్ఎస్ రాజకీయ ఆధిపత్యానికి నిదర్శనమన్నారు. టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి రుజువైందని, శాసన మండలిలోని స్థానిక సంస్థల కోటా నుంచి జరిగిన ఎన్నికలలో మొత్తం 12 స్థానాలు గెలవడం, క్లీన్ స్వీప్ చేయడం గర్వకారణమన్నారు.

ఈ 12 సీట్లలో 6 స్థానాలను ఏకగ్రీవంగా గెల్చుకోవడం, పోలింగ్ జరిగిన ఆరింటిని భారీ మెజారిటీతో గెలవడం టిఆర్ఎస్, సీఎం కెసిఆర్ గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వం పట్ల, వారి పరిపాలనా పటిమ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసమే ఈ గెలుపుకు నిదర్శనమన్నారు.
అలాగే గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజానీకం యావత్తు టిఆర్ఎస్, సీఎం కెసిఆర్ గారి వెంటే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు.

ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులకు, సహకరించిన పార్టీ ప్రముఖులకు, నాయకులకు, శ్రేణులకు మరో మారు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాలతో మరింత ఉత్సాహం తో ప్రజలకు సేవ చేస్తామని, ప్రజల ఆదరాభిమానాలు టిఆర్ఎస్ కు కొండంత అండ అని మంత్రి పేర్కొన్నారు.

Related posts

ఢిల్లీలో మౌన దీక్ష‌కు దిగిన కేఏ పాల్‌!

Drukpadam

అమరావతిపై చంద్రబాబు నాటకాలు …మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్ ..

Drukpadam

అవినాశ్ నేరస్థుడు కాదు.. తప్పించుకోవడమూ లేదు….సజ్జల

Drukpadam

Leave a Comment