Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఏపీ పోలీసులు కు చిక్కిన ముగ్గురు చడ్డీగ్యాంగ్ ముఠా సభ్యులు!

ఏపీ పోలీసులు కు చిక్కిన ముగ్గురు చడ్డీగ్యాంగ్ ముఠా సభ్యులు!
-గుజరాత్‌లో ఏపీ పోలీసులకు పట్టుబడిన ముఠా సభ్యులు!
-గత నెలలో గుజరాత్ నుంచి విజయవాడ వచ్చిన ముఠా
-పోరంకి, వసంత్‌నగర్‌లో చోరీలు
-అక్కడి నుంచి గుజరాత్‌లోని దాహోద్‌కు ఫోన్ కాల్స్
-ఒక్కో ముఠాలో ఐదుగురు చొప్పున రెండు ముఠాలు ఉన్నట్టు అనుమానం
-ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు?

ఏపీ పోలిసుల కళ్లుకప్పి అనేక చోరీలకు పాల్పడి చిక్క కుండా తప్పించుకున్న చడ్డీగ్యాంగ్ ను గుజరాత్ లో పట్టుకున్నారు. వారి ఫోన్ కాల్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నారు . అయితే గ్యాంగ్ లోని ముగ్గురు సభ్యులు మాత్రమే దొరికారు మిగతా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

విజయవాడ, గుంటూరులో యథేచ్ఛగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యుల్లో కొందరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని గుజరాత్‌లోని దాహోద్‌లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మిగిలిన వారి ఆచూకీ కోసం వారిని ప్రశ్నిస్తున్నారు. చెడ్డీగ్యాంగ్‌లో ఒక్కో దాంట్లో ఐదుగురు చొప్పున రెండు ముఠాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ముఠా ఈ నెల 7న పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోరంకి, వసంత్‌నగర్‌లో చోరీలకు పాల్పడింది. ఆ తర్వాత ముఠా కదలికలు ఆగిపోయాయి. నిఘా పెరగడంతో ముఠా గుజరాత్ చెక్కేసినట్టు అనుమానించిన పోలీసులు రెండు బృందాలను ఆ రాష్ట్రానికి పంపారు. చెడ్డీగ్యాంగ్ సభ్యులు ఉపయోగించిన ఫోన్ల ఆధారంగా వీరి ఆచూకీని కనిపెట్టారు.

గత నెలలో రైలులో గుజరాత్ నుంచి వచ్చిన ముఠా విజయవాడలో దిగింది. అనంతరం ఓ రోజు మొత్తం వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఇళ్లను ఎంపిక చేసుకుంది. అనంతరం చిట్టినగర్, గుంటుపల్లి, పోరంకిలో చోరీలకు పాల్పడింది.

పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతం నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతం నుంచి గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతానికి కొన్ని ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసు బృందాలు వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

Related posts

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. మావోలకు పెద్ద ఎదురుదెబ్బ 26 మంది మృతి!

Drukpadam

ఎంఎస్ ధోనీపై పరువునష్టం కేసు నమోదు.. రేపు విచారణ

Ram Narayana

హై అల‌ర్ట్‌!.. ప్ర‌ధానిని హ‌త్య చేస్తాన‌ని అగంతుకుడి ఈ మెయిల్‌!

Drukpadam

Leave a Comment