Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
వ్యవసాయం వార్తలు

మిర్చిపంట కు వైరస్ …నష్టపోయిన మిర్చి రైతులు!

మిర్చిపంట కు వైరస్ …నష్టపోయిన మిర్చి రైతులు
ప్రకృతి విపత్తు గా భావించి మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష నష్టపరిహారం ఇవ్వాలి
మిర్చి తోటలకు వైరస్ తో పాటు గులాబీ, ఎర్ర రంగు పురుగులు వలన భారీ నష్టం
సిపిఎం ఆధ్వర్యంలో డిసెంబర్ 20 న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు
రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు

ఈ ఏడాది మిర్చిపంటకు వైరస్ సోకడంతో తీరని నష్టం జరిగిందని అందువల్ల కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు మిర్చి రైతులను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది . సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరరావు ఆద్వర్యంలోని ఒక బృందం వైరా మండలంలోని సిరిపురం గ్రామంలోని వైరస్ భారిన పడిన మిర్చి పంటలను పరిశీలించారు. ఎకరా మిర్చికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లక్షలాది ఎకరాల్లో మిర్చి తోటలకు వైరస్ తో పాటు గులాబీ, ఎర్ర రంగు పురుగులు వలన భారీ నష్టం జరిగింది అని మిర్చి రైతులకు జరిగిన నష్టం పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలను తాయారు చేసి ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 20 న సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా రైతులు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు అన్నారు, బుధవారం వైరా మండలం సిరిపురం గ్రామంలో వైరస్ తో దెబ్బ తిన్న మిర్చి తోటలను సిపిఎం , రైతు సంఘం బృందం పరిశీలించింది, ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయింది అని దాని లో 80 శాతం మిర్చి పంట దెబ్బ తిన్ని తోటలను తొలిగించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం జరుగుతుంది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం పంట నష్టం పై అంచనాలు కూడా తయారు చేయించుట లేదని అన్నారు , ఆరకోర గా అక్కడ,అక్కడ మిగిలిన మిర్చి తోటలను రక్షించే ప్రయత్నం లో రైతులు భారీ గా పెట్టుబడులు పెట్టుతున్నారు అని అన్నారు, మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 20 న సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే రైతు ధర్నా లో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించటం లేదని అన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి తోటలకు జరిగిన నష్టం పకృతి విపత్తు గా నిర్ణయించి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాతా భాస్కర్ రావు, సిపిఎం వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, తల్లాడ మండల కార్యదర్శి ఐనాల రామలింగేశ్వర రావు, సిరిపురం సిపిఎం గ్రామ కార్యదర్శి చింతనిప్పు చంద్రారావు , గుట్టుపల్లి వెంకటయ్య, రుద్రాక్షల వెంకటయ్య, శ్రీనివాస్ రావు సత్యం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Related posts

రైతు చట్టాలను పాతరేయాల్సిందే :బ్లాక్ డే లో రైతు ఉద్యమనేత తికాయత్…

Drukpadam

ఫలించిన తుమ్మల కృషి…ఆనందంలో రైతులు!

Drukpadam

2000 టమాటా బాక్సులు అమ్మి రూ.38 లక్షలు సంపాదించిన కర్ణాటక రైతు…

Drukpadam

Leave a Comment