హైద్రాబాద్ మేయర్ సంచలన ప్రకటన …అది నిరూపిస్తే చెవి కోసుకుంటా!
బీజేపీ కార్పొరేటర్లను కలవడం లేదనే ఆరోపణలు
ఆ విషయాన్ని నిరూపించండి.. చెవి కోసుకుంటానంటున్న మేయర్ విజయలక్ష్మి
బీజేపీ కార్పొరేటర్లను కలవడం లేదనే విషయాన్ని నిరూపించమని సవాల్
అన్ని పార్టీల కార్పొరేటర్లకు నేను అందుబాటులో ఉన్నా
కార్పొరేటర్లు, అధికారుల మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నా
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైద్రాబాద్ మేయర్ జి .విజయలక్ష్మి బీజేపీ కార్పొరేటర్లను కలవడంలేదనే ఆరోపణల నేపథ్యంలో ఒక సవాల్ విసిరారు . నేను అందరు కార్పొరేటర్లను కలుస్తున్నాను .కొందరు పనికట్టుకొని నాపైన ఆరోపణలు చేయడం సరికాదు . నేను అన్ని పార్టీల కార్పొరేటర్లను కలసి వారి డివిజన్లలో జరుగుతున్నా అభివృద్ధి ఇతర సమస్యలు గురించి చర్చిస్తాను .అది బీజేపీ కార్పొరేటర్లతో సహా . కానీ నేను కావడంలేదని ఆరోపిస్తున్నారు . అది నిరూపించండి . నేడు చెవి కోసుకుంటా అని ప్రకటించారు. మేయర్ ప్రకటన సంచలనంగా మారింది. బీజేపీ సభ్యులు నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో అనే ఆశక్తి నెలకొన్నది .
బీజేపీ కార్పొరేటర్లను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై ఆమె స్పందిస్తూ అన్ని పార్టీల కార్పొరేటర్లకు తాను అందుబాటులో ఉన్నానని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లకు దూరంగా ఉన్నానని నిరూపిస్తే తన చెవి కోసుకుంటానని అన్నారు.
మేయర్ ఛాంబర్ పై బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు దాడి చేయడంపై ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్లకు అందుబాటులో ఉండటం లేదని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని… అందుకే జోన్లవారీగా సమావేశాలను నిర్వహిస్తున్నానని చెప్పారు. కొర్పొరేటర్లు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించి వారి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని అన్నారు. అందరినీ కలుపుకుని పోతానని చెప్పారు.