Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీలోకి డీఎస్ పునరాగమనం… రేపు అధికారిక ప్రకటన!

కాంగ్రెస్ పార్టీలోకి డీఎస్ పునరాగమనం… రేపు అధికారిక ప్రకటన!
-ఈ ఉదయం సోనియాతో చర్చలు
-40 నిమిషాలకు పైగా భేటీ
-రేపు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన చేస్తుందన్న భట్టి
-అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళుతున్నట్టు వెల్లడి

డీ ఎస్ గా పిలవబడే ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్త ఆశక్తిగా మారింది. దీన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్రువీకరించారు. ధర్మపురి శ్రీనివాస్ ఈ రోజు ఉదయం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. ఆమె తో 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. డీ ఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేశారు. ఆయన పనిచేసిన సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఉదయం డీఎస్ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చలు జరిపారు. దాదాపు 40 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీలో డీఎస్ చేరిక దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. రేపు ఆయన అధికారికంగా కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వచ్చాయి. ఆయన చేరిక పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

దీనిపై రేపు ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. అధిష్ఠానం పిలుపుమేరకు భట్టి కూడా ఢిల్లీ వెళుతున్నారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడడానికి హస్తిన వెళుతున్నట్టు ఆయన వెల్లడించారు.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి.శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అని తెలిసిందే. వైఎస్ క్యాబినెట్లో మంత్రిగానూ వ్యవహరించారు. అయితే 2009 ఎన్నికల్లో డీఎస్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అవకాశం ఇచ్చింది.

కాగా, డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. అరవింద్ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి క్రమంగా డీఎస్ కు, టీఆర్ఎస్ కు మధ్య దూరం పెరిగింది. త్వరలోనే రాజ్యసభ్యుడిగా డీఎస్ పదవీకాలం ముగియనుంది.

Related posts

ఖమ్మం సంకల్ప సభలో కేసీఆర్ పై షర్మిల నిప్పులు

Drukpadam

కేంద్ర మంత్రుల‌తో రాజ‌ధాని రైతుల భేటీ.. ఏమేం కోరారంటే..?

Drukpadam

అమిత్ షా పార్లమెంటులో అబద్ధం చెప్పారు… ‘నాగాలాండ్ ఘటన’పై నిరసనకారుల ధ్వజం!

Drukpadam

Leave a Comment